Asianet News TeluguAsianet News Telugu

రూ.10వేలలోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ కావాలా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి

చాల మందికి మంచి ఫోన్ కొనాలని ఉంటుంది. అది కూడా మంచి ఫీచర్స్ ఉన్నదైతే బావుంటుందని చూస్తుంటారు. మన బడ్జెట్లో బెస్ట్ కెమెరా ఫీచర్స్ కోసం వెదుకుతుంటారు.  మీరు కూడా తక్కువ ధరకే మంచి కెమెరా ఫోన్ కొనాలనుకుంటే ఈ ఫోన్స్ బెస్ట్ ఛాయిస్ కావొచ్చు... 
 
Best Camera Smartphones Under Rs.10K.. Full List Here check out..!-sak
Author
First Published Jun 27, 2024, 9:02 AM IST

ఈ రోజుల్లో చాలా మంది మంచి కెమెరా ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లనే ఇష్టపడుతున్నారు. అయితే రూ. 10,000లోపు బెస్ట్ కెమెరా ఫోన్‌ అంటే పైసా వసూల్ అనే చెప్పాలి... మీరు కూడా అలాంటి ఫోన్ కోసం చేస్తున్నారా..? మార్కెట్లో లభించే బడ్జెట్  ఫోన్స్ ఇవిగో... 

రూ.10వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్స్

Best Camera Smartphones Under Rs.10K.. Full List Here check out..!-sak

Poco C65 దీని ధర రూ. 6,799. POCO C65 కెమెరా సెటప్‌లో AI లెన్స్‌తో  50-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 8-మెగాపిక్సెల్ సెన్సార్ ఇంకా మంచి బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది.

Best Camera Smartphones Under Rs.10K.. Full List Here check out..!-sak

Realme C55 స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,590. దీనిలో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ ఉన్నాయి. 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో 17.07 cm (6.72-inch) ఫుల్-HD+ డిస్‌ప్లే, Helio G88 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

Best Camera Smartphones Under Rs.10K.. Full List Here check out..!-sak

Itel A70 మొబైల్ ధర రూ.7,499. itel A70లో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ ఉన్నాయి. సింగిల్ కెమెరా ఫీచర్ కావాలనుకునే వారికీ  మంచి   ఫోన్.

Best Camera Smartphones Under Rs.10K.. Full List Here check out..!-sak

లావా బ్లేజ్ 2 ధర రూ.8,899. మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా డ్యూయల్ లెన్స్ సెటప్ ఉంది. ఇంకా  తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోలు తీయడానికి సహాయపడుతుంది.

Best Camera Smartphones Under Rs.10K.. Full List Here check out..!-sak

Moto G04s స్మార్ట్‌ఫోన్ ధర రూ.6,999. ప్రైమరీ పనులకు నమ్మకమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అద్భుతమైన స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కూడా. ఈ స్మార్ట్‌ఫోన్ IP52 రేటింగ్‌ పొందింది. Moto G04 బడ్జెట్ కస్టమర్‌లకు గొప్ప అప్షన్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios