Asianet News TeluguAsianet News Telugu

1 ఉద్యోగం కోసం 48 గంటల్లో 3000 అప్లికేషన్లు; ఆశ్చర్యపోయిన కంపెనీ సీఈఓ.. పోస్ట్ వైరల్

బెంగుళూరు స్టార్టప్ సీఈఓ 48 గంటల్లో 3000 కంటే ఎక్కువ రెజ్యూమ్‌లను వర్క్ ఫ్రమ్  హోమ్ అందించే జాబ్ ఓపెనింగ్ కోసం అందుకున్నారు. బెంగుళూరులోని సిలికాన్ సిటీలో  ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎంత అధ్వాన్నంగా ఉందో అతనికి ఆశ్చర్యం కలిగించింది. 

Bengaluru company gets 3000 resumes in 48 hours for 1 job; CEO wonders-sak
Author
First Published Jul 20, 2023, 5:57 PM IST

బెంగుళూరు స్టార్టప్‌కి చెందిన ఒక CEO ఉద్యోగం కోసం 48 గంటల్లో 3000 రెజ్యూమ్‌లను అందుకున్నారు, అతను కంపెనీ వెబ్‌సైట్‌లో 'పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్' అంటూ ఒక పోస్ట్ చేశాడు. షాక్ తిన్న బెంగుళూరుకు చెందిన టెక్ స్టార్టప్ స్ప్రింగ్‌వర్క్స్ CEO కార్తిక్ మండవిల్లే 'జాబ్ మార్కెట్ ఎంత దారుణంగా ఉంది?' అని ట్విట్టర్‌లో అడిగారు.

జాబ్ పోస్టింగ్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉందని, ఏ ఇతర జాబ్ పోర్టల్‌లోనూ ప్రమోట్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. 'జాబ్ పోస్టింగ్ ఈ నెలలో ఇంకా  అలాగే ఉంది, ఇప్పటి వరకు 12,500 పైగా అప్లికేషన్లు వచ్చాయి' అని ఒక యూజర్ చేసిన కామెంట్ కి ఆయన బదులిచ్చారు.

బెంగుళూరులోని సిలికాన్ సిటీలో  ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎంత అధ్వాన్నంగా ఉందో అతనికి ఆశ్చర్యం కలిగించింది. లే ఆఫ్ సీజన్ వల్ల వేలాది మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారని, చాలా మంది నుండి దరఖాస్తులు రావడానికి ఇది ఒక కారణమని చాలా మంది యూజర్లు  కామెంట్స్ చేసారు. 

అంతేకాకుండా, ఈ  జాబ్ లొకేషన్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ గా  లిస్ట్ చేయబడింది. బెంగళూరులోని ఐటీ కంపెనీలు 2023 ద్వితీయార్థం నుంచి  ఉద్యోగులను ఆఫీసులకి రమ్మని అడుగుతున్నాయి.

 

అందువల్ల, చాలా మంది ఉద్యోగులు  వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఇంకా అలంటి పనిని అందించే ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. ఒక యూజర్ కబీర్ సింగ్ (@KabirKabby) జాబ్ మార్కెట్ బ్యాడ్ గా ఉందని కామెంట్ చేసారు, "చాలా బ్యాడ్. నేను ఢిల్లీలో IT కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లినట్లు గుర్తుంది. నేను ఇంటర్వ్యూ  కోసం కేవలం విజిటర్ నే. అయితే కేవలం 20 పోస్టులకు 700 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్యాకేజీ 2.5 LPA." అంటూ కామెంట్ సెక్షన్ లో పేర్కొన్నారు.  

మరో యూజర్ ఆకాష్ (@aakash__rewari)  "నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంది,  కాలేజెస్ లో నేర్చుకున్న సబ్జెక్ట్‌తో సంబంధం లేకపోయినా యువకులు ఉద్యోగాల కోసం తహతహలాడుతున్నారు." అని కామెంట్ లో అన్నారు. 

బెంగళూరు అంతటా ఉద్యోగ పరిస్థితి చాలా కష్టంగా ఉందని సూచిస్తుంది. ఐటి కంపెనీలు  ఉద్యోగులను బెంగళూరులోని ఆఫీసులకి తిరిగి  రావాలని పిలుస్తుండటంతో, ఇంటి ఓనర్లు అద్దె ధరలను కూడా పెంచుతున్నారు, పెరుగుతున్న ఇంటి  ధరలతో ఉద్యోగులు రెండు విధాలుగా నష్టపోతున్నారు.  

“AI (ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్) పరిచయం అనేక ఉద్యోగాలను భర్తీ చేసింది. దీనికి సంబంధించి కొంత ప్రోటోకాల్ ఉండాలి. కాబట్టి కంపెనీలు తమ ఇష్టానుసారంగా ఉద్యోగులను తొలగించలేవు” అని మరో యూజర్  కామెంట్ చేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios