Asianet News Telugu

పెగాసస్ ను మరవక ముందే వాట్సాప్ లో మరో భద్రతా లోపం

వాట్సాప్‌ ను మరో వివాదం చుట్టుకుంది.  ఇప్పుడు ఎమ్‌పీ4 వీడియో ఫైల్స్ రూపంలో సమస్య వచ్చిపడింది. వాట్సాప్‌లోని ఒక చిన్న బగ్‌ ఆధారంగా  ఎంపీ4 వీడియో ఫైల్స్ రూపంలో హ్యకర్లు దాడికి యత్నిస్తున్నారని ఫేస్‌బుక్ అధికారికంగా ప్రకటించింది. 

before even the pegasus spyware has been forgotten, now another whatsapp bug
Author
California, First Published Nov 17, 2019, 5:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వాట్సాప్ ద్వారా మొబైళ్ళలోకి చొరబాబుది ఫోన్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే పెగాసస్ స్పై వేర్ ఉదంతం అందరికి గుర్తుండే ఉంటుంది. ప్రపంచంలోని ఎందరో మొబైళ్ళు హ్యాక్ అయినట్టు వాట్సాప్ మాతృ సంస్థైన పేస్ బుక్ సదరు వ్యక్తులకు మెసేజిలు పెట్టిన విషయం విదితమే. 

ఇప్పుడు వాట్సాప్‌ ను మరో వివాదం చుట్టుకుంది.  ఇప్పుడు ఎమ్‌పీ4 వీడియో ఫైల్స్ రూపంలో సమస్య వచ్చిపడింది. వాట్సాప్‌లోని ఒక చిన్న బగ్‌ ఆధారంగా  ఎంపీ4 వీడియో ఫైల్స్ రూపంలో హ్యకర్లు దాడికి యత్నిస్తున్నారని ఫేస్‌బుక్ అధికారికంగా ప్రకటించింది. 

Also read: Whatsapp Scandal: స్పైవేర్ అంటే ఏమిటి, వాట్సాప్‌ను తీసేస్తే మీ ఫోన్ సేఫేనా! ?

తెలియని నంబర్ల నుండి కానీ, అనుమానాస్పద నంబర్ల నుండి కానీ వీడియో ఫైల్స్ వచ్చి నట్లైతే, కాస్త జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ .తమ యూజర్స్ ను హెచ్చరించింది.  ఆటో డౌన్‌లోడ్ ఆప్షన్ ని ఆన్ చేయకుండా ఉంటే సరిపోతుందని, అప్పుడు వచ్చే ప్రతి వీడియోను మనకు అవసరముంటే మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చని, దీని ద్వారా ఈ ముప్పు నుండి తప్పించుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. 

ఒకవేళ ఆన్ చేసి ఉంటే, ఈ ఆప్షన్ ని డిజేబుల్ చేయడం ద్వారా కూడా ఈ రకమైన సైబర్ దాడినుంచి రక్షించుకోవచ్చిన పేర్కొంది. కొంచం అజాగ్రత్తగా ఉన్న కూడా, మొబైల్ ఫోన్ కంట్రోల్ అంతా పరాధీనం అయిపోయి, అందులో ఉన్న సమాచారం అంతా దొంగిలించబడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇంతకూ, వాట్సాప్‌లోని ఈ భద్రతా లోపాన్ని ఎలా గుర్తించిందో మాత్రం ఫేస్‌బుక్ ఇంకా వెల్లడించలేదు. వీలైనంత త్వరగా వాట్సప్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేసుకుంటే ప్రమాదావకాశాలు ఎంతో కొంత మేర తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

మొన్నీ మధ్యే వచ్చిన పెగాసస్ స్పై వేర్ ను గనుక తీసుకుంటే, వాట్సాప్ మాతృసంస్థైన పేస్ బుక్ అమెరికాలో ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థపైన కేసు దాఖలు చేసింది. ఈ సదరు సంస్థ ప్రజల ఫోన్లలోకి వాట్సాప్ ద్వారా చొరబడే ఒక స్పైవేర్ ను తాయారు చేసారని ఆరోపించింది. 

ఈ కేసు దాఖలు చేసే ముందు వాట్సాప్ సంస్థకు ఈ విషయమై ఒక సమాచారం అందింది. అందగానే ప్రపంచంలోనే కొందరు మేటి హ్యాకర్లను పిలిపించి ఈ విషయమై శోధన ఆరంభించింది.(సమాచారం వాట్సాప్ కు ఎలా అందిందనేది కింద కూలంకషంగా తెలుసుకుందాము)

Also read: whatsapp scandal : ప్రియాంకా గాంధీ వాట్సాప్‌ హ్యాక్

సిటిజెన్ ల్యాబ్ అనే సంస్థ ఈ శోధన మొదలుపెట్టింది. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 1400మంది ఫోన్లు హ్యాక్ అయినట్లు తేల్చింది. సదరు 1400మందికి ఈ సమాచారాన్ని కూడా చేరవేసింది. 

తొలుత భారత దేశంలో బయటపడ్డ పేర్లను చూస్తే చాలామంది లెఫ్ట్ ఐడియాలజీ సానుభూతిపరులో లేక వారితోనే సన్నిహిత సంబంధం కలిగినవారుగానో తేలింది. వీరంతా భీమా కోరేగావ్ ఉదంతంతోటి సంబంధమున్న వ్యక్తులవడం గమనార్హం. 

ఇప్పుడు తాజాగా ప్రియాంక గాంధీ ఫోన్ కూడా హ్యాక్ అయినట్టు తెలుపడంతో ఇదేదో మెగా స్కాండల్ కు దారితీసే విధంగా కనపడుతుంది. ప్రస్తుతానికి లెక్క 1400 ఉన్నా, వాస్తవానికి ఈ సంఖ్యా ఇంకా చాలా ఎక్కువ ఉండే ఆస్కారముంది. 

Follow Us:
Download App:
  • android
  • ios