tata UPI app:త్వరలో టాటా గ్రూప్ డిజిటల్ పేమెంట్ యాప్‌.. గూగుల్ పే, ఫోన్ పేకి పోటీగా అందుబాటులోకి..

టాటా గ్రూప్ త్వరలో యూ‌పి‌ఐ యాప్‌ను ప్రారంభించనుంది. దీంతో పాటు టాటా గ్రూప్ ఇప్పుడు యూ‌పి‌ఐ చెల్లింపుల క్లబ్‌లో చేరడానికి సిద్ధమవుతోంది. వాస్తవానికి, టాటా గ్రూప్  స్వంత యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపు సేవను అందించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి అనుమతి కోరుతున్నట్లు ఒక నివేదిక పేర్కొంది.
 

ata Group will soon launch its digital payment app, Google Pay and PhonePe will get a direct competition

ఇప్పుడు టాటా గ్రూప్ కూడా డిజిటలైజేషన్ రేసులో ముందడుగు వేస్తోంది. నిజానికి,  టాటా గ్రూప్ యూ‌పి‌ఐ పేమెంట్స్ క్లబ్‌లో చేరడానికి సన్నాహాలు చేసింది. దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన యూ‌పి‌ఐ  (UPI) ఆధారిత సర్వీస్ ప్రొవైడర్ ఫోన్ పే (PhonePe), గూగుల్ పే (Google Pay), వాట్సప్ పే  (WhatsAppPay), అమెజాన్ పే (AmazonPay), పేటి‌ఎం ( Paytm) తర్వాత ఇప్పుడు టాటా గ్రూప్ త్వరలో  స్వంత డిజిటల్ పేమెంట్ యాప్‌ను ప్రారంభించనుంది.

ఒక నివేదిక ప్రకారం, టాటా గ్రూప్ దేశంలో  స్వంత యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపు సేవను అందించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి అనుమతి కోరుతోంది . థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్స్ (tpap)గా వ్యవహరించడానికి టాటా గ్రూప్ ఏ‌పి‌ఎన్‌ఐసికి దరఖాస్తు చేసిందని ఒక నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, టాటా గ్రూప్ సేవలను వీలైనంత త్వరగా లేదా వచ్చే నెలలో ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

టాటా గ్రూప్ ఈ డిజిటల్ పేమెంట్ యాప్‌కు 'టాటా న్యూ' అని పేరు పెట్టింది. వచ్చే నెల ఐపిఎల్ సెషన్‌లో టాటా గ్రూప్  యాప్‌ను లాంచ్ చేయాలని యోచిస్తోందని నివేదిక పేర్కొంది. ఈ యాప్ బిగ్‌బాస్కెట్, 1ఎంజి, క్రోమా, టాటా క్లిక్ వంటి అన్ని టాటా డిజిటల్ యాప్‌లను అలాగే  ఫ్లైట్ బుకింగ్ సేవలను ఒకే యాప్‌లో వినియోగదారులకు సులభంగా యాక్సెస్ చేస్తుంది. నివేదికలను విశ్వసిస్తే, టాటా డిజిటల్ ఏప్రిల్ 7న దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయవచ్చు. 

బ్యాంకులతో భాగస్వామ్యం అవసరం
నిబంధనల ప్రకారం, AmazonPay, WhatsAppPay, Google Pay వంటి నాన్-బ్యాంకింగ్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లు భారతదేశంలో  స్వంత UPI ఆధారిత చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ను అందించడానికి బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉండాలి. ఇందుకు సంబంధించి టాటా గ్రూప్‌కు చెందిన డిజిటల్‌ కామర్స్‌ విభాగమైన టాటా డిజిటల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌తో చర్చలు జరుపుతున్నట్లు నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ను శక్తివంతం చేయడానికి కంపెనీ మరో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ భాగస్వామితో కూడా చర్చలు జరుపుతోందని కొన్ని వర్గాలు తెలిపాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios