అసుస్ పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్.. చిన్న డిస్‌ప్లేతో అదిరిపోయే ఫీచర్లు..

ఈ ఫోన్ ని  మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, సన్‌సెట్ రెడ్ అండ్ స్టార్రీ బ్లూ కలర్‌లలో లాంచ్ చేసారు. ఈ ఫోన్  8జి‌బి RAMతో 128 జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర 799 యూరోలు అంటే సుమారు రూ. 64,500

Asuss powerful smartphone launch strong features will be available with small display know  price

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అసుస్  కొత్త స్మార్ట్‌ఫోన్ Asus Zenfone 9 ను గురువారం విడుదల చేసింది.  ఈ స్మార్ట్ ఫోన్ Asus నుండి వస్తున్న చిన్నదైన కానీ శక్తివంతమైన ఫోన్. ఈ ఫోన్ 5.9-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ ప్లే, 50-మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్‌ ఉంది. Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ ఈ ఫోన్‌లో ఇచ్చారు. ఫోన్‌లో మీరు గరిష్టంగా 16జి‌బి RAMతో 256జి‌బి స్టోరేజ్ చూడవచ్చు. ఈ ఫోన్ ఫీచర్లు, ధర అండ్ స్పెసిఫికేషన్ గురించి మీకోసం..

Asus Zenfone 9 ధర
Asus Zenfone 9 మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, సన్‌సెట్ రెడ్ అండ్ స్టార్రీ బ్లూ కలర్‌లలో లాంచ్ చేసారు. ఈ ఫోన్  8జి‌బి RAMతో 128 జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర 799 యూరోలు (సుమారు రూ. 64,500). 8 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌  కూడా ఈ ఫోన్ లాంచ్ చేయబడింది. ఫోన్  బేస్ వేరియంట్‌ను తైవాన్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు, ఇతర వేరియంట్‌లు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. అయితే ఇతర వేరియంట్ల ధరల సమాచారాన్ని  కంపెనీ త్వరలో విడుదల చేయనుంది.

స్పెసిఫికేషన్‌లు
Asus Zenfone 9 120Hz రిఫ్రెష్ రేట్, 1,080x2,400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 5.9-అంగుళాల పూర్తి HD+ Samsung AMOLED డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1,100 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత ZenUIతో వస్తుంది. Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ 256 GB UFS 3.1 స్టోరేజ్ ఇంకా 16 GB వరకు LPDDR5 RAMని పొందుతుంది. HDR10, HDR10+, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dirac HD సౌండ్‌కి సపోర్ట్ కూడా ఫోన్‌లో అందించారు.  

కెమెరా
Asus Zenfone 9 డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది, దీని ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ Sony IMX766 f/1.9 ఎపర్చరుతో వస్తుంది. రెండవ కెమెరా 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ IMX368 సెన్సార్,  f/1.9 ఎపర్చరుతో వస్తుంది. ఫోన్  ప్రైమరీ కెమెరాలో సిక్స్ యాక్సెస్ గింబల్ స్టెబిలైజర్‌కు సపోర్ట్ ఉంది. సెల్ఫీ కోసం 12-మెగాపిక్సెల్ సోనీ IMX663 సెన్సార్‌, ఎపర్చరు f/2.45  ఉంటుంది. 8K వరకు వీడియో రికార్డ్ చేసే ఆప్షన్ కూడా ఫోన్‌లో  ఉంది.

బ్యాటరీ
Asus Zenfone 9 4,300mAh బ్యాటరీని, 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, Wi-Fi 6/6E, బ్లూటూత్ v5.2, GPS/A-GPS / NavIC, NFC, FM రేడియో, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్  ఉంది. వాటర్ అండ్ డస్ట్ రిసిస్టంట్  కోసం  IP68 రేటింగ్‌ పొందుతుంది. ఫోన్ బరువు 169 గ్రాములు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios