Asianet News TeluguAsianet News Telugu

18 జి‌బి ర్యామ్ తో అసుస్ పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్స్.. ప్రపంచంలోనే మొదటి ఫోన్‌లు ఇవే..

అసుస్ ROG ఫోన్ 6, ROG ఫోన్ 6 ప్రో 18 జి‌బి వరకు ర్యామ్, 512జి‌బి వరకు స్టోరేజ్ పొందుతాయని ఒక నివేదిక తెలిపింది. హైలెట్ ఏంటంటే  అసుస్ రోగ్ ఫోన్ 6 Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో ప్రారంభించిన ప్రపంచంలోనే మొదటి ఫోన్.

Asuss most powerful smartphone will be launched in july 5 know its features and highlights
Author
Hyderabad, First Published Jul 2, 2022, 7:07 PM IST

తైవాన్ మల్టీ నేషనల్ కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అసుస్ (Asus) రెండు మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లు  అసుస్ ROG ఫోన్ 6 అండ్ ROG ఫోన్ 6 ప్రోలను వచ్చే వారం జూలై 5న ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ రెండు ఫోన్‌ల టీజర్‌ను కూడా కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్ నుండి విడుదల చేసింది. Asus ROG ఫోన్ 6 ఇంకా ROG ఫోన్ 6 ప్రో ఇండియాలో Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో తీసుకురానున్నారు, అయితే ఈ ప్రాసెసర్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన Android ప్రాసెసర్.


అసుస్ ROG ఫోన్ 6, ROG ఫోన్ 6 ప్రో 18 జి‌బి వరకు ర్యామ్, 512జి‌బి వరకు స్టోరేజ్ పొందుతాయని ఒక నివేదిక తెలిపింది. హైలెట్ ఏంటంటే  అసుస్ రోగ్ ఫోన్ 6 Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో ప్రారంభించిన ప్రపంచంలోనే మొదటి ఫోన్.

అసుస్ ROG ఫోన్ 6, ROG ఫోన్ 6 ప్రో ఫోన్‌లను చల్లగా ఉంచే పెద్ద వేపర్ ఛాంబర్ పొందుతుంది. వీటిలో Asus ROG ఫోన్ 6 12జి‌బి ర్యామ్, 256జి‌బి స్టోరేజ్ లభిస్తుంది. అయితే ROG ఫోన్ 6 ప్రో 18జి‌బి ర్యామ్, 512జి‌బి స్టోరేజ్‌తో ప్రవేశపెట్టనున్నారు. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 12తో వస్తాయి.

Asus ROG ఫోన్ 6, ROG ఫోన్ 6 ప్రో 165Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో లాంచ్ కానున్న ప్రపంచంలోనే మొదటి ఫోన్‌లు ఇవే. రెండు ఫోన్‌లకు రెండు USB టైప్-సి పోర్ట్‌లు ఉంటాయి, వాటిలో ఒకటి ఛార్జింగ్ కోసం, మరొకటి ఏరో కూలర్ కోసం ఉపయోగించవచ్చు.

ROG ఫోన్ 6, ROG ఫోన్ 6 ప్రోలో మూడు బ్యాక్ కెమెరాలు ఉంటాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌. ఈ రెండు ఫోన్లతో మీరు 8K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ROG ఫోన్ 5s, ROG ఫోన్ 5 లాగానే ఈ లేటెస్ట్ ఫోన్లు  ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో  6000mAh బ్యాటరీ పొందుతాయి. ఫోన్‌తో పాటు రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios