Asianet News TeluguAsianet News Telugu

సిఎంకి లంబోర్ఘిని కార్ గిఫ్ట్: చూసి చాలా థ్రిల్‌ ఆయ్యానని సోషల్ మీడియాలో వెల్లడి..

కరీంగంజ్‌కు చెందిన కారు లవర్ నూరుల్ హక్ తయారు చేసిన 'లంబోర్గినీ' కారుని చూసి చాలా థ్రిల్‌ ఆయ్యానని సీఎం సోషల్ మీడియాలో తెలిపారు. ఈ గిఫ్ట్ అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. 

 Assam CM got Lamborghini car as a gift its price is just Rs 10 lakh
Author
First Published Dec 5, 2022, 1:32 PM IST

అస్సాం సీఎం హేమంత బిస్వాకు 'లంబోర్గినీ' లాంటి కారు గిఫ్ట్ గా లభించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అస్సాం సీఎం స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొత్తానికి మ్యాట‌ర్ ఏంట‌ంటే...

సీఎంకు గిఫ్ట్ ఎవరు ఇచ్చారంటే..?
అస్సాం సీఎంకు 'లంబోర్గినీ' లాంటి కారు గిఫ్ట్ గా లభించింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నిజానికి ఈ కారును సీఎంకు ఒక బడా పారిశ్రామికవేత్తనో లేదా ప్రత్యేక వ్యక్తి ఇవ్వలేదు, అస్సాం రాష్ట్రంలో మెకానిక్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.

అస్సాం సీఎం
కరీంగంజ్‌కు చెందిన కారు లవర్ నూరుల్ హక్ తయారు చేసిన 'లంబోర్గినీ' కారుని చూసి చాలా థ్రిల్‌ ఆయ్యానని సీఎం సోషల్ మీడియాలో తెలిపారు. ఈ గిఫ్ట్ అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నూరుల్ ఫ్యూచర్ కి అల్ ది బెస్ట్ కూడా తెలిపారు.

'లంబోర్గినీ' కారుని ఎలా తయారు చేశాడంటే
నిజానికి స్విఫ్ట్ కారును మోడీఫే చేయడం ద్వారా నూరుల్ లంబోర్ఘినిని తయారు చేశాడు. నూరుల్ వృత్తిరీత్యా మెకానిక్ ఇంకా ఈ కారును ముఖ్యమంత్రికి గిఫ్ట్ గా ఇచ్చేందుకు గౌహతి వెళ్ళాడు. కారును చూసిన సీఎం కూడా ఆశ్చర్యపోయి నూరుల్ టాలెంట్ ని  అభినందించారు.

నూరుల్ సంతోషం వ్యక్తం 
నూరుల్ కూడా సీఎం హేమంత బిస్వాకు గిఫ్ట్ ఇవ్వడంతో చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం పది లక్షల రూపాయలు ఖర్చు చేశానని, 'లంబోర్ఘిని' వంటి సూపర్‌కార్‌ను నడపాలని తాను ఎప్పటినుంచో కోరుకునేవాడినని నూరుల్ చెప్పాడు. ఇంతకుముందు నూరుల్ దిమాపూర్‌లో కార్ మెకానిక్‌గా పనిచేసేవాడు, కానీ తరువాత అతను కార్లను మోడిఫై చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఈ కారును సీఎంకు ఇచ్చిన తర్వాత 'ఫెరారీ' లాంటి సూపర్‌కార్‌ను తయారు చేయాలన్నది తన లక్ష్యం అని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios