5g smartphone:మీరు ఇప్పుడు 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం సరైన నిర్ణయమేన ? నిపుణులు సలహా ఏంటంటే..
మొదటి 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో 24 ఫిబ్రవరి 2020న ప్రారంభించారు. ఈ స్మార్ట్‌ఫోన్ రియల్ మీ ఎక్స్50ప్రొ. రియల్ మీ ఎక్స్50ప్రొ భారతదేశంలో రూ 44,999 ప్రారంభ ధరతో ప్రవేశపెట్టారు.
ఫిబ్రవరి 2017 బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో చైనీస్ కంపెనీ జెడ్‌టిఈ (ZTE) ప్రపంచంలోనే మొట్టమొదటి 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది, దీనికి 'గిగాబైట్ ఫోన్' అని పేరు పెట్టారు. ఈ ఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్ గురించి చెప్పాలంటే సెకనుకు 1జిబి అని క్లెయిమ్ చేసింది. కొద్దిరీజుల క్రితం ఫిబ్రవరి 28న మళ్ళీ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2020 ప్రారంభమైంది. గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో 5జీ ఫోన్లు విడుదలయ్యాయి. మొదటి 5జి స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో 24 ఫిబ్రవరి 2020న లాంచ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ పేరు రియల్ మీ ఎక్స్50ప్రొ. రియల్ మీ ఎక్స్50ప్రొ భారతదేశంలో రూ 44,999 ప్రారంభ ధరతో ప్రవేశపెట్టారు.
రూ. 13,999 ప్రారంభ ధరతో 5జి ఫోన్‌లు
భారతదేశంలో మొదటి 5G ఫోన్‌ను ప్రారంభించినప్పటి నుండి గత రెండేళ్లలో చాలా 5G ఫోన్‌లు లాంచ్ అయ్యాయి, వీటిని లెక్కించడం కష్టం. సింపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు భారతదేశంలో 5G ఫోన్‌లు మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. రూ.13,999 ప్రారంభ ధరతో మీరు 5G ఫోన్‌ను పొందవచ్చు. 20 వేల రూపాయల శ్రేణిలో ఎన్నో 5G ఫోన్లు అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో 5G మార్కెట్ రోజురోజుకి పెరుగుతోంది, అయితే 5G నెట్ వర్క్ లాంచ్‌కు ముందే 5G ఫోన్‌ను కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయమా ?
భారతదేశంలో 5G ఎప్పుడు ప్రారంభమవుతుంది?
అన్నింటిలో మొదటిది దేశంలో 5G నెట్‌వర్క్ ఎప్పుడు ప్రారంభించబడుతుందో తెలుసుకోవడం ముఖ్యం, భారతదేశంలో 5G లాంచ్ గురించి ఎవరి వద్ద ఖచ్చితమైన సమాధానం లేదు. అన్ని టెలికాం కంపెనీలు ట్రయల్ కోసం స్పెక్ట్రమ్‌ను పొందాయి. మొదటి ట్రయల్ గత ఏడాది నవంబర్‌లో ముగిసింది, ఇప్పుడు ట్రయల్‌ని మే 2022 వరకు పొడిగించారు అంటే మే వరకు 5Gని ప్రారంభించే అవకాశం లేదు. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో యుద్ధ ప్రాతిపదికన 5Gని ప్రయత్నిస్తున్నాయి, అయితే అవి సాధారణ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో తెస్తుంది అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. 5G లాంచ్‌కు ప్రభుత్వం ఇంకా తేదీని నిర్ణయించలేదు.
ఇప్పుడు 5G ఫోన్ కొనడం తప్పు నిర్ణయమా ?
మీలో చాలా మందికి 5G ఫోన్ ఉండే ఉంటుంది. కొన్ని మొబైల్ కంపెనీలు ఫోన్‌లను ఫ్యూచర్ రెడీ ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. స్నేహితుల నుంచి మంచి సలహా తీసుకున్నా.. 5G ఫోన్ మాత్రమే తీసుకోవాలీ ఆని సలహా వస్తుంది, అయితే 2020లో Future Ready పేరుతో 5G ఫోన్ కొన్న వారి గురించి ఒక్కసారి ఆలోచించారా. నేడు రెండేళ్ల తర్వాత వారి 5జి ఫోన్‌కు వయసు అయిపోయింది కానీ 5G మాత్రం అందుబాటులోకి రాలేదు.
5G నెట్‌వర్క్ లాంచ్‌కు ముందు 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ప్రశ్నపై నిపుణుల సలహా ఏంటంటే '5G ఫీచర్లను చూపుతూ ఖరీదైన ఫోన్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి, అయితే 5G నెట్‌వర్క్ ప్రారంభించిన తర్వాత, పోటీ మరింత పెరుగుతుంది. తర్వాత తక్కువ ధరకే 5G ఫోన్ అందుబాటులో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, 5G స్మార్ట్‌ఫోన్‌ను ముందుగానే కొనుగోలు చేయడం ఇప్పుడు తెలివైన నిర్ణయం కాదు అని సూచిస్తున్నారు.