ఆన్‌లైన్‌లో పేమెంట్   చేసే వారి కోసం ఒక ముఖ్యమైన ప్రకటన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 

కొత్త సంవత్సరంలో ఆన్‌లైన్ చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ కానుకను అందించింది. ప్రస్తుతం, ఆన్‌లైన్ పేమెంట్ విస్తృతంగా ఉపయోగించబడుతోంది, అయితే ఆన్‌లైన్ పేమెంట్లను సులభతరం చేయడంలో ప్రధాన సమస్య ఫిక్స్డ్ లిమిట్. అంటే.. ఒక రోజులో రూ.1 లక్ష కంటే ఎక్కువ లావాదేవీలను ప్రభుత్వం నిషేధించింది.

అయితే, ఇప్పుడు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే NPCI, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే RBI ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొంది, ఇప్పుడు రూ. 5 లక్షల UPI చెల్లింపును ఒకేసారి చేయవచ్చు. ఇందుకు యూజర్లు తెలుసుకోవలసిన కొన్ని షరతులు ఉన్నాయి.

NPCI ఆసుపత్రులు, విద్యా సంస్థల వంటి అవసరమైన సంస్థలకు ఒకేసారి రూ. 5 లక్షల వరకు ఆన్‌లైన్ చెల్లింపులను సడలించింది. ఈ కొత్త నిబంధన జనవరి 10 నుంచి అమల్లోకి వస్తుంది. దీని తర్వాత వినియోగదారులు అన్ని విద్యా సంస్థలు, ఆసుపత్రుల ఫీజులను ఒకేసారి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు చెల్లించవచ్చు.

ఇందుకోసం బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్‌పీసీఐ సూచించింది. వెరిఫైడ్ మర్చంట్స్ NPCI ద్వారా రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల చెల్లింపు పరిమితి అమలు చేయబడుతుంది. పెరిగిన పరిమితితో వ్యాపారి తప్పనిసరిగా UPIని పేమెంట్ పద్ధతిగా ప్రారంభించాలి. ప్రస్తుతం UPI పేమెంట్ పరిమితిని నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NPCI) రోజుకు రూ. 1 లక్షగా నిర్ణయించింది.

గత మానిటరీ పాలసీ రివ్యూ సమావేశంలో ఆర్‌బీఐ పేమెంట్ పరిమితిని రూ.5 లక్షలుగా ప్రతిపాదించింది. దీని కారణంగా Paytm, Google Pay ఇంకా PhonePe వంటి పేమెంట్ యాప్‌లు ప్రయోజనం పొందుతాయి. గత సంవత్సరం, NPCI దాదాపు 1 సంవత్సరం పాటు నిష్క్రియంగా ఉన్న అన్ని UPI IDలు మూసివేయబడతాయని ఒక ప్రకటనలో తెలిపింది. దింతో Google Pay, Paytm అండ్ PhonePe వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. ఇది డిసెంబర్ 31 నుండి ప్రారంభమైంది.

 UPI చెల్లింపుల గురించి మాట్లాడినట్లయితే, 2023 నాటికి UPI చెల్లింపుల పరంగా భారతదేశం 100 బిలియన్లను దాటుతుంది. ఈ ఏడాది పొడవునా రూ.118 బిలియన్ల విలువైన UPI చెల్లింపులు జరిగాయి. గతేడాది కంటే 60 శాతం వృద్ధి నమోదైంది.