Asianet News TeluguAsianet News Telugu

ఫోన్లు పేలేది అందుకే.. పౌచులో వీటిని అస్సలు పెట్టకూడదు..

మీరు చేసే చిన్న పొరపాట్లు మొబైల్ పేలుడుకు కారణమవుతాయి. నివేదికల ప్రకారం, ATM కార్డ్, నోట్లు మొబైల్ వెనుక కవర్‌లో  పెట్టడం  కూడా  ఫోన్‌లు పేలడానికి కారణం.

Are you a person who keeps cash and ATM cards in a mobile cover? Change this immediately.. Note it, pass-sak
Author
First Published May 22, 2024, 5:51 PM IST

మీరు మీ ఫోన్ వెనుక పౌచ్ కవర్‌లో ఫోటో, పైసల నోటు లేదా ఏదైనా పేపర్ పెట్టినట్లయితే జాగ్రత్తగా ఉండండి. లేకపోతే, మీరు పెద్దగా నష్టపోవచ్చు లేదా మీ ఫోన్ పేలిపోవచ్చు. గత కొన్ని నెలలుగా స్మార్ట్‌ఫోన్‌లు పేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇలా జరగవచ్చు. నివేదికల ప్రకారం ATM కార్డ్,  మొబైల్ వెనుక పౌచ్    కవర్‌లో నోట్లు ఉంచడం కూడా ఖరీదైన ఇంకా చౌకైన ఫోన్‌లు పేలడానికి ఒక కారణం. స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫోన్  పౌచ్ మందంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

అంతే కాకుండా, అనేక రకాల వస్తువులను పౌచ్ లోపల పెడుతుంటారు. ఫోన్‌కి పౌచ్ వేసి బ్యాక్ కవర్‌లో ఏదైనా పేపర్ ఇంకా వస్తువులను ఉంచినప్పుడు గాలి గ్యాప్ ఉండదు. దీంతో ఫోన్ వేడెక్కడంతోపాటు పేలిపోతుంది. చాలా మందికి మెట్రో కార్డ్, కరెన్సీ నోటు లేదా మరేదైనా వస్తువును ఫోన్ వెనుక కవర్‌లో ఉంచే అలవాటు ఉంటుంది, కొందరు దీనిని అదృష్టమని నమ్ముతారు, కొంతమందికి వివిధ కారణాలుంటాయి. ఫోన్  బ్యాక్ కవర్‌లో పేపర్ లేదా డబ్బు నోట్లను ఉంచడం వల్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌లో సమస్యలు తలెత్తుతాయి. మీ ఈ అలవాటు మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు, పూర్తిగా ఛార్జ్ అయ్యే వరకు వాటిని తీసి పక్కన పెట్టండి.

ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని ఉపయోగిస్తే ఫోన్ వేడెక్కడం ఇంకా  పేలిపోయే ప్రమాదం ఉంది. మీకు ఫోన్‌ బ్యాక్ కవర్ కావాలంటే, సన్నని, ట్రాన్సపరెంట్  కవర్‌ను వాడండి. ఫోన్ కవర్ మందంగా లేదా డబ్బు నోట్లు, ATM కార్డ్, ఫోటో  మొదలైన వాటిని ఫోన్ కవర్‌లో ఉంచడం ఫోన్ ఓవర్ హీటింగ్ సమస్యకు అతిపెద్ద కారణాలలో ఒకటి. కంపెనీ ఛార్జర్‌ని కాకుండా వేరే ఛార్జర్ ఉపయోగించడం లేదా లోకల్ ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల మీ ఫోన్ హీట్ అవుతుంది, దీంతో ఫోన్ పేలిపోతుంది. కొన్నిసార్లు మీ ఫోన్ అధిక ఉష్ణోగ్రత కారణంగా వేడెక్కవచ్చు. కాబట్టి ఎక్కువ సేపు ఎండలో ఫోన్ వాడకుండా ఉండండి.

ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఏ కారణం చేతనైనా గేమింగ్ లేదా ఫోన్‌ని ఉపయోగించడం మానుకోండి. ఛార్జింగ్ పెట్టి వాడితే ఫోన్ పేలిపోయే ప్రమాదం ఛాన్సెస్ ఎక్కువ. ఫోన్‌ను ఛార్జింగ్ చేసేటప్పుడు, దాని పౌచ్  తీసివేయడం మంచిది.  కొంత సమయం తరువాత, ఫోన్‌ను ఆన్ చేసి ఉపయోగించండి. ఆ తర్వాత కూడా ఫోన్ వేడెక్కుతున్నట్లయితే, ఫోన్ సెట్టింగ్‌లలో ఏ యాప్‌లు ఎంత బ్యాటరీని ఉపయోగిస్తున్నాయో చెక్ చేసి, వాటిని క్లియర్ చేయండి. ఏదైనా  తెలియని లేదా ఆవసరంలేని   అప్లికేషన్ ఉంటే, వెంటనే ఫోన్ నుండి అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios