Asianet News TeluguAsianet News Telugu

పూర్తిగా మారిపోనున్న ఆపిల్ ఐఫోన్.. 16 సిరీస్ ఫీచర్స్, లాంచ్ ఎప్పుడో తెలుసా?

రాబోయే iPhone 16 సిరీస్ సాధారణ Apple iPhone కంటే భిన్నంగా ఉండనుంది. కొత్త డిజైన్‌లో వినియోగదారుల ముందుకు రానుంది. హాప్టిక్ సపోర్ట్, వైడ్ &అల్ట్రావైడ్ లెన్స్‌తో పాటు ఈ డిజైన్ వైడ్ వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 

Apple iPhone will change completely! Do you know which month iPhone 16 series will be released?-sak
Author
First Published Jul 2, 2024, 9:47 AM IST

ఐఫోన్ 16 లాంచ్ దగ్గరపడుతున్న కొద్దీ ఆన్‌లైన్‌లో కొత్త కొత్త లీక్‌లు వస్తున్నాయి. Apple లాంచ్ తేదీని 2-3 నెలల ముందుగానే ఉంటుందని అనుకోలేము. ఐఫోన్ లాంచ్ ఈవెంట్‌ ప్రతి సంవత్సరం జరిగుతుంది. ఈసారి iPhone 16 సిరీస్‌ను సెప్టెంబర్ 2024లో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. 

రాబోయే iPhone 16 సిరీస్ సాధారణ Apple iPhone కంటే కొత్త డిజైన్‌లో వస్తుందని కూడా లీకులు చెబుతున్నాయి. హాప్టిక్ సపోర్ట్, వైడ్ & అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుందని, ఈ డిజైన్ వైడ్  వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ గతంలో హై-ఎండ్ ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు ప్రత్యేకమైంది. ఇంకా కొత్త ప్రత్యేక క్యాప్చర్ వీడియో రికార్డింగ్‌ ఈజీ  చేస్తుంది. పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్, USB టైప్-సి పోర్ట్ ఐఫోన్ 15 సిరీస్‌కి అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.

ఐఫోన్ 16 సిరీస్ వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం పెద్ద డిస్‌ప్లే, స్లిమ్ బెజెల్స్‌తో వస్తుంది. iPhone 16 Pro, iPhone 16 Pro Max రెండు పెద్ద 6.3-అంగుళాల & 6.9-అంగుళాల స్క్రీన్‌లతో పెద్ద కాన్వాస్‌ను అందిస్తాయి. అయితే సింగిల్ హ్యాండ్ ఉపయోగం కోసం సమస్య కావచ్చు. మరోవైపు, స్టాండర్డ్  iPhone 16, iPhone 16 Plus వాటి  6.1-అంగుళాల & 6.7-అంగుళాల స్క్రీన్ సైజ్  నిలుపుకోగలవని భావిస్తున్నారు. కానీ 120Hz రిఫ్రెష్ రేట్ పరిచయంతో మనం గొప్ప అభివృద్ధిని చూడవచ్చు.

 ప్రో మోడళ్లగానే  పర్ఫార్మెన్స్  పరంగా, iPhone 16, iPhone 16 Plus A18 SoC ద్వారా శక్తిని పొందుతాయని భావిస్తున్నారు, అయితే iPhone 16 Pro & Pro Max లేటెస్ట్  A18 Pro చిప్‌తో ఉండవచ్చు. ప్రో మోడల్‌లు ప్రస్తుత గ్రాఫైట్ ప్యాడ్‌లకు బదులుగా గ్రాఫేన్ ప్యాడ్‌లు ఉంటాయని పుకారు కూడా ఉంది. 

ఐఫోన్ 16 సిరీస్ మెరుగుపడుతుందని భావిస్తున్న మరొక ఫీచర్ బ్యాటరీ లైఫ్. ఐఫోన్ 16.. 3,561mAh బ్యాటరీతో ఉండవచ్చని, ఐఫోన్ 16 ప్లస్.. 4,006mAhతో రావచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. ప్రో మోడల్ బ్యాటరీ గురించి వివరాలు ఇంకా తెలియనప్పటికీ, iPhone 16 Pro Max పెద్ద 4,676mAh బ్యాటరీతో వస్తుందని పుకారు కూడా ఉంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ కెమెరా సామర్థ్యాలలో బెస్ట్ గా ఉంటుంది. ఐఫోన్ 16 ప్రో ఐఫోన్ 15 ప్రో మాక్స్ లాగానే  5x ఆప్టికల్ జూమ్ కెపాసిటీ  ఉంటుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios