ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్.. కేవలం రూ.5 వేలకే.. ఇలా బుక్ చేసుకోండీ..
ఆపిల్ ఈ ఏడాది సెప్టెంబర్ 7న అతిపెద్ద ఈవెంట్ 'ఫార్ అవుట్'లో ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇండియాలో ఐఫోన్ 14 ప్రొ ప్రారంభ ధర రూ. 1,29,900, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,39,900.
దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఈ-కామర్స్ కంపెనీ రకరాల ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రవేశపెట్టాయి. తాజాగా ఐఫోన్ కొత్త మోడల్ ని ఆపిల్ లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. చాలా మందికి ఆపిల్ ఐఫోన్ ఒక కల. కానీ దాని అధిక ధర కారణంగా కొనుగోలు చేయాలేకపోతుంటారు. అయితే ఈ ఫెస్టివల్ సీజన్ కి మీరు కూడా ఆపిల్ ఐఫోన్ కొనాలని చూస్తున్నారా.. అయితే ఆపిల్ ఐఫోన్ కొత్త మోడల్ పై అందిస్తున్న ఆఫర్ల గురించి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు బడ్జెట్ ధరకే ఆపిల్ ఐఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా... ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఆపిల్ ఐఫోన్ 14 పై ఈఎంఐ ఆప్షన్ అందిస్తుంది.
ఆపిల్ ఈ ఏడాది సెప్టెంబర్ 7న అతిపెద్ద ఈవెంట్ 'ఫార్ అవుట్'లో ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇండియాలో ఐఫోన్ 14 ప్రొ ప్రారంభ ధర రూ. 1,29,900, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,39,900. ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో ఐఫోన్ 14 ప్రో సిరీస్ ధర ఐఫోన్ 13 ప్రో సిరీస్ ధర కంటే రూ. 10,000 వరకు ఎక్కువ. ఐఫోన్ 14 సిరీస్ కింద ఆపిల్ నాలుగు కొత్త ఐఫోన్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో అండ్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఉన్నాయి.
ఇండియాలో ఆపిల్ ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ గోల్డ్ కలర్ 1టిబి స్టోరేజ్ ధర రూ.1,89,900. ఈ ఫోన్ పై 1 సంవత్సరం వారంటీ, ఇన్-బాక్స్ అక్సెసోరిస్ పై 6 నెలల వారంటీ అందిస్తుంది. అంతేకాదు సెలెక్టెడ్ మోడల్స్ పై ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ స్పేస్ బ్లాక్ కలర్ 512జిబి స్టోరేజ్ ధర రూ.1,69,900.
అందుబాటులో ఉన్న ఆఫర్‌లు
-హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ నాన్-ఈఎంఐ, క్రెడిట్ ఆండ్ డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ..4000 ఇన్స్టంట్ డిస్కౌంట్
- ఫ్లిప్ కార్ట్ ఆక్సీస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్
- ఈ ప్రాడక్ట్ కొనుగోలు పై బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022లో ఆశ్చర్యకరమైన క్యాష్‌బ్యాక్ కూపన్ పొందవచ్చు
- ఫ్లిప్ కార్ట్ సైన్ అప్ తో పే లెటర్ ద్వారా రూ.1000 వరకు ఫ్లిప్ కార్ట్ గిఫ్ట్ కార్డ్ పొందవచ్చు.
మీరు జెస్ట్ మని నో కాస్ట్ ఈఎంఐ పై నెలకు రూ.56,634కే కొనుగోలు చేయవచ్చు. ఇంకా ప్రతినెల రూ.17,069తో 12 నెలల ఈఎంఐ ద్వారా కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగే ఆక్సీస్ బ్యాంక్, ఎస్‌బిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బిఓబి బ్యాంక్, సీటీ బ్యాంక్, యెస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ పై ప్రతినెల అతితక్కువ ఈఎంఐ ఆప్షన్స్ అందిస్తున్నాయి.
ఎస్‌బిఐ క్రీడిట్ కార్డ్ పై ప్రతినెల రూ.8,238తో 24 నెలలకు ఈఎంఐ చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్ కార్ట్ ఆక్సీస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రతినెల రూ.5890తో 36 నెలలకు ఈఎంఐ చెల్లించి కొనుగోలు చేయవచ్చు.