అమేజాన్ ప్రైమ్ డే సేల్.. బెస్ట్ డీల్స్ ఇవే..

First Published 17, Jul 2018, 1:14 PM IST
amazon prime day sale...these are the best deals
Highlights

 ఫ్యాషన్‌, లైఫ్‌స్టయిల్‌, హోమ్‌ డెకర్ల నుంచి పెద్ద పెద్ద గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్ల వరకు భారీ మొత్తంలో డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లకు కూడా బడ్జెట్‌ ధరలో లభ్యమవుతున్నాయి.
 

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. జులై 16న ప్రారంభమైన ఈ ఆఫర్..నేటి అర్థరాత్రి వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో అన్ని బ్రాండు ఉత్పత్తులపై కూడా ఉత్తమమైన డిస్కౌంట్లను అమెజాన్‌ ప్రకటించింది. ఫ్యాషన్‌, లైఫ్‌స్టయిల్‌, హోమ్‌ డెకర్ల నుంచి పెద్ద పెద్ద గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్ల వరకు భారీ మొత్తంలో డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లకు కూడా బడ్జెట్‌ ధరలో లభ్యమవుతున్నాయి.

ఈ ప్రైమ్ డే సేల్ లో.. బడ్జెట్ ధరలో(రూ.15వేల లోపు) లభించే స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి..

శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌8 - రూ.9,990(అసలు ధర రూ.13,490)
నోకియా 5(16జీబీ) - రూ.11,599 (అసలు ధర రూ.15,299)
ఎల్‌జీ క్యూ6ప్లస్‌ - రూ.19,990 నుంచి రూ.12,990కు తగ్గింపు
శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌ 2 - రూ.12,990కు తగ్గింపు
హానర్‌ 7ఎక్స్‌(64జీబీ) - రూ.13,999కు లభ్యం
జియోని ఎం7 పవర్‌ - రూ.18,279 నుంచి రూ.10,999కు తగ్గింపు 
శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌(64జీబీ) - రూ.11,990కు తగ్గింపు
ఒప్పో ఏ57(32జీబీ) - రూ.11,990(అసలు ధర రూ.14,990)
ఆసుస్‌ జెన్‌ఫోన్‌4 సెల్ఫీ - రూ.7,999(అసలు ధర రూ.10,999)
కార్బన్‌ ఫ్రేమ్స్‌ ఎస్‌9 - రూ.5,899(రూ.8,999)
రెడ్‌మి వై2 స్మార్ట్‌ఫోన్‌ 32 జీబీ వేరియంట్‌ కూడా రూ.9999కు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి వచ్చింది. హానర్‌ 7సీ కూడా రూ.9499కు, మోటో ఈ5 ప్లస్‌ కూడా రూ.11,999కు అందుబాటులోకి వచ్చాయి. అదనంగా మోటో జీ5ఎస్‌ ప్లస్‌ 64జీబీ వేరియంట్‌పై 29 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్‌ ఆఫర్‌ చేస్తోంది. మొబైల్‌ ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు, పవర్‌ బ్యాంక్‌లు, స్క్రీన్‌ ప్రొటెక్టర్లు, కేసెస్‌, కవర్స్‌, డేటా కేబుల్స్‌ వంటి మొబైల్‌ యాక్ససరీస్‌పై సుమారు 80 శాతం డిస్కౌంట్లను అమెజాన్‌ అందిస్తోంది

loader