రేపే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం : ఈ స్మార్ట్‌ఫోన్స్ పై బెస్ట్ డీల్.. తక్కువ ధరకే వన్ ప్లస్..

అమెజాన్ ప్రైమ్ డే 2022లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ని పొందాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ ఆఫర్ మీకు చాలా డబ్బు ఆదా చేస్తుంది. 

Amazon Prime Day 2022: Best deal will be available on these smartphones, know how much you will get benefit

అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 23 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏడాదిలాగే ఈ సేల్‌లోనూ ఆఫర్ల వర్షం కురువనుంది. ఈ సంవత్సరం కూడా అమెజాన్ అండ్ ఫోన్ తయారీ కంపెనీలు  అమెజాన్ ప్రైమ్ డే 2022 నాడు  స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఆఫర్‌లను విడుదల చేశాయి. మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ డే  2022లో మీరు ఏ ఫోన్‌పై ఎంత తగ్గింపు పొందుతారో తెలుసుకోండి..

ఆపిల్ ఐఫోన్ 13 
ఈ అమెజాన్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 13 బేస్ వేరియంట్‌ను రూ. 66,900కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఎం‌ఆర్‌పి ధర రూ.79,900. అయితే బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లను ఉపయోగించడం ద్వారా మీరు ఈ ఫోన్‌ను రూ.66,900కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో A15 బయోనిక్ ప్రాసెసర్, 512జి‌బి వరకు స్టోరేజ్, 6.1-అంగుళాల రెటినా XDR డిస్‌ప్లే, 12-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి.

వన్ ప్లస్ 10ఆర్ 
వన్ ప్లస్ 10ఆర్ పై ఈ సేల్‌లో సుమారు 5 వేల తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ ఎం‌ఆర్‌పి ధర రూ. 38,999, అయితే బ్యాంక్ ఆఫర్‌లు, కూపన్‌లను ఉపయోగించడం ద్వారా ఈ ఫోన్‌ను రూ.33,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల HD + AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8100-మాక్స్ ప్రాసెసర్, 150W సూపర్ ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్, సోనీ IMX766 సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

వన్ ప్లస్  నార్డ్ CE 2 
వన్ ప్లస్  నుండి వస్తున్న ఈ మిడ్-రేంజ్ ఫోన్ రూ. 24,999 ధరతో లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.23,999. అమెజాన్  ప్రైమ్ డే సేల్ 2022లో మీరు ఈ ఫోన్‌ను రూ. 22,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.43-అంగుళాల స్క్రీన్, డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది.

వన్ ప్లస్  నార్డ్  CE 2 లైట్ 
వన్ ప్లస్ బడ్జెట్ ఫోన్ OnePlus Nord CE 2 Lite కొనుగోలు చేయడానికి ఇదే బెస్ట్ ఛాన్స్. ఈ సెల్‌లో OnePlus Nord CE 2 Liteని 17,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఎం‌ఆర్‌పి రూ.19,999 ధరతో ఈ ఫోన్ విడుదలైంది. OnePlus నుండి వచ్చిన మొదటి బడ్జెట్ ఫోన్ ఇదే. 6.59-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఇన్-డిస్ ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. 

స్యామ్సంగ్ గెలాక్సీ ఎం33 
Samsung ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్‌లో చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ని ఎం‌ఆర్‌పి రూ. 24,999 ధరతో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.17,999. ఈ ఫోన్‌లో 6.6-అంగుళాల డిస్‌ప్లే, 6,000mAh బ్యాటరీ, Exynos 1280 ప్రాసెసర్ ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios