ముంబై: స్మార్ట్‌ఫోన్స్‌, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై యువతకు ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు బిగ్‌ డే సేల్‌ లాంటివి నిర్వహిస్తూ భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ‘అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్ 2019’ పేరుతో ఈ నెల15, 16వ తేదీల్లో ప్రైమ్‌ డే సేల్‌ను నిర్వహించనుంది.

 

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్స్‌లో వన్‌ప్లస్‌ ఒకటి. మే నెలలో వన్‌ప్లస్‌ 7 సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మిర్రర్‌ గ్రే కలర్‌తో 6జీబీ ర్యామ్‌ వేరియంట్‌ను మాత్రమే తీసుకురాగా, 8జీబీ ర్యామ్‌ మోడల్‌లో మిర్రర్‌ గ్రేతో పాటు, రెడ్‌ కలర్‌ను కూడా విడుదల చేసింది. 

 

ఇప్పుడు మిర్రర్‌ బ్లూ కలర్‌ను అందుబాటులోకి తెచ్చింది. జులై 15-16 తేదీల్లో జరిగే అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో ఇది విక్రయానికి రానుంది. జులై 15న రాత్రి 12గంటల నుంచి ఇది కేవలం ప్రైమ్‌ కస్టమర్లకు మాత్రమే లభించనుంది. 6జీబీ ర్యామ్‌ విత్ 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంటుంది.

 

వన్‌ప్లస్‌ 7 మిర్రర్‌ బ్లూ ధరను రూ.32,999గా నిర్ణయించారు. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌కార్డుతో ప్రైమ్‌ కస్టమర్లు అదనంగా మరో రూ.1,750 రాయితీ పొందవచ్చు. అదే వన్‌ప్లస్‌ 7ప్రోపై ఏకంగా రూ.3,500 డిస్కౌంట్‌ లభించనుంది.  

 

వన్‌ప్లస్‌ 7 మిర్రర్‌ బ్లూ ఫోన్ 6.41 ఫుల్‌హెచ్‌డీ ప్లస్ ఆమ్లాయిడ్‌ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అలాగే ఆక్సిజన్‌ ఓఎస్‌, ఆండ్రాయిడ్ 9.0,  స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, బ్యాకప్ 48+5మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్‌ కెమెరా, శరవేగంగా చార్జింగ్ చేసేలా 20 వాట్ల సామర్థ్యం గల 3700 ఎంఏహచ్‌ బ్యాటరీ కూడా ఉంది. 

 

ఇంకా పది ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్లను అందించనున్నట్లు సంస్థ  పేర్కొంది. అయితే వీటిపై ఎంత డిస్కౌంట్‌ అందిస్తుందనే విషయాన్ని మాత్రం అమెజాన్ ప్రకటించలేదు. వన్ ప్లస్ తోపాటు ఈ బిగ్‌ డే సేల్‌లో యాపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్, హువావే పీ30 లైట్‌, ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌, ఐఫోన్‌ ఎక్స్‌, ఒప్పో ఎఫ్‌11 ప్రో, శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ50, వివో వీ15 ప్రో, వివో నెక్స్‌ తదితర స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో మరింత డిస్కౌంట్‌, క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశాలున్నట్లు సంస్థ ప్రకటించింది.