Asianet News TeluguAsianet News Telugu

ప్రెషర్ కుక్కర్‌ అమ్మినందుకు లక్ష జరిమానా.. ఎందుకో తెలుసా..?

ఇప్పటి వరకు విక్రయించిన కుక్కర్లను కూడా వినియోగదారుల నుంచి వెనక్కి తీసుకుని సంబంధిత డబ్బు  మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఈ కమీషన్ ఆర్డర్ తర్వాత అమెజాన్ ఇప్పుడు దాదాపు 2,265 ప్రెషర్ కుక్కర్‌లను రీకాల్ చేయాల్సి ఉంటుంది.
 

Amazon fined Rs 1,00,000 for allowing sale of faulty pressure cookers
Author
Hyderabad, First Published Aug 6, 2022, 12:19 PM IST

మీలో చాలామంది తప్పనిసరిగా ఆన్‌లైన్ షాపింగ్  చేస్తుంటారు. ఒకోసారి మనకు చెడు ప్రాడక్ట్ వస్తుంది. కొన్నిసార్లు ఇ-కామర్స్ సైట్‌లు ప్రాడక్ట్ రీప్లేస్ చేస్తాయి, కానీ కొన్నిసార్లు అవి కస్టమర్‌లకు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇప్పుడు ఇదే కేసులో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) లక్ష రూపాయల జరిమానా విధించింది.  చీఫ్ కమీషనర్ నిధి ఖరే నేతృత్వంలోని అథారిటీ   ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో తప్పనిసరి ప్రమాణాలను ఉల్లంఘించి దేశీయ ప్రెషర్ కుక్కర్‌లను విక్రయించడానికి అనుమతించినందుకు అమెజాన్‌కు వ్యతిరేకంగా ఒక ఆర్డర్‌ను ఆమోదించింది. అసలు విషయం ఏంటంటే....

2,265 ప్రెషర్ కుక్కర్‌ల రీకాల్ 
అమెజాన్ నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించి, డిఫెక్ట్ ఉన్న ప్రెజర్ కుక్కర్లను విక్రయించిందని కన్జ్యూమర్ కమిషన్ తెలిపింది. జరిమానా చెల్లించడమే కాకుండా కస్టమర్ల నుంచి ఇప్పటివరకు విక్రయించిన కుక్కర్లను వాపసు తీసుకొని సంబంధిత డబ్బు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కన్జ్యూమర్ కమిషన్ అమెజాన్‌ను ఆదేశించింది. ఈ కమీషన్ ఆర్డర్ తర్వాత అమెజాన్ ఇప్పుడు దాదాపు 2,265 ప్రెషర్ కుక్కర్‌లను రీకాల్ చేయాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించి అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, షాప్‌క్లూస్, స్నాప్‌డీల్‌లకు కూడా హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటివరకు విక్రయించిన అలాంటి కుక్కర్‌ల ద్వారా అమెజాన్ రూ.6,14,825.41 కమీషన్‌గా పొందింది. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అమెజాన్‌ను కమిషన్ కోరింది. కుక్కర్‌లో ఎలాంటి లోపం ఉందో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.

Paytm మాల్‌కు వ్యతిరేకంగా CCPA ఇదే విధమైన పెనాల్టీ విధించి ఇంకా డిఫెక్ట్ ప్రెషర్ కుక్కర్‌లను రీకాల్ చేయాలని పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios