న్యూఢిల్లీ: అమెజాన్, ఆపిల్, అలీబాబా సంస్థలు ప్రమాదకరమని ఐటీ దిగ్గజ సంస్థలు పరిగణిస్తున్నాయని కేపీఎంజీ నివేదిక పేర్కొన్నది. ఈ రిటైలర్ సంస్థ వ్యూహాల వల్ల తమకు ఎంతో నష్టం జరుగుతోందని దిగ్గజ సంస్థలు తెలిపినట్టు నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఈ-కామర్స్ సంస్థలు మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో సామాజిక మాధ్యమాలు ఉన్నట్లు వెల్లడించింది.

అమెజాన్, ఆపిల్, అలీబాబా వంటి సంస్థల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని సాంకేతిక రంగంలో ఉన్న సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని కేపీఎంజీ అనే వ్యాపార గణాంకాల సంస్థ నివేదిక వెల్లడించింది. ఆ వ్యాపార సంస్థలు పాటించే వ్యాపార వ్యూహాలు తమకు నష్టం చేకూర్చేవిగా ఉన్నాయని ఈ దిగ్గజ సంస్థలు అభిప్రాయపడుతున్నాయని పేర్కొందీ నివేదిక.

also read సౌదీలోనూ చకచకా దూసుకెళ్తున్న మన ‘రూపే’కార్డు...

ఈ నివేదిక కోసం అంతర్జాతీయంగా ఉన్న 740 సాంకేతిక వ్యాపార సంస్థల సమాచారాన్ని విశ్లేషించింది కేపీఎంజీ. దిగ్గజ సంస్థలకు నష్టం కలిగిస్తోన్న వాటిలో డీజేఐ, గూగుల్, నెట్​ఫ్లిక్స్, ఎయిర్​బీఎన్​బీ, మైక్రోసాఫ్ట్​, ఫేస్​బుక్​, బైదు వంటి సంస్థలు ముందంజలో ఉన్నట్లు పేర్కొంది.

దిగ్గజ వ్యాపార సంస్థలకు అంతరాయం కలిగించే వాటిలో  ఈ-కామర్స్ సైట్లు ముందంజలో ఉండగా.. రెండో స్థానంలో సామాజిక మాధ్యమాలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ సాంకేతిక ఆవిష్కరణల విభాగంలో.. సాంకేతిక పరిశ్రమలోని దిగ్గజ సంస్థలు, మిలీనియల్స్ సంస్థలకు చెందిన వ్యూహకర్తల మధ్య ఉన్న విభిన్నతను కేపీఎంజీ అంచనా వేసింది.‌

also read 300 విమానాలను ఆర్డర్ చేసిన ఇండిగో...

ఈ జాబితాలో సాంకేతిక దిగ్గజ సంస్థల్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అగ్ర స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానంలో టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్​ ఉన్నారు. అదే సమయంలో మిలీనియల్స్​ వ్యాపార సంస్థల ప్రతినిధులు దిగ్గజ సంస్థలతో సమానంగా తమను తాము నిరూపించుకున్నారు. వారిలో హువావే సీఈఓ రెన్ జెంగ్​ఫీయీ, షాయోమీ సీఈఓలీ జున్, సాఫ్ట్​ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ స్థానం సంపాదించుకున్నారు.