ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ మరో కొత్త ప్లాన్ ని ప్రవేశపెట్టింది. జియో, ఐడియా, వొడాఫోన్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ఈరకమైన ఆఫర్ ని ప్రవేశపెట్టింది. బేసిక్‌ లెవల్‌ యూజర్ల కోసం 75 రూపాయలతో సరికొత్త ప్లాన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 

ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసిన ఈ ఎంట్రీ-లెవల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ కింద యూజర్లకు 28 రోజుల పాటు 300 నిమిషాల ఉచిత కాల్స్‌, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, 1 జీబీ 2జీ/3జీ/4జీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ప్రకటించింది. వాయిస్‌ కాల్స్‌లో లోకల్‌, ఎస్టీడీ, అవుట్‌ గోయింగ్‌ రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉన్నాయి. 

కాగ, అంతకముందే ఎయిర్‌టెల్‌ రూ.47తో ఓ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దాని వాలిడిటీ కూడా 28 రోజులే. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ ప్రత్యర్థి ఐడియా సెల్యులార్‌ కూడా రూ.75 ప్లాన్‌ను కలిగి ఉంది. ఐడియా కూడా తన ప్లాన్‌పై 300 నిమిషాల కాలింగ్‌, 1జీబీ 4జీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లనే ఆఫర్‌ చేస్తోంది. అయితే ఐడియా కేవలం ఈ ప్లాన్‌ను తన 4జీ సర్కిల్‌ వినియోగదారులకే అందిస్తోంది.