Asianet News TeluguAsianet News Telugu

ఒకే ఆధార్‌తో 658 సిమ్ కార్డ్‌లు; విజయవాడ, తమిళనాడుతో సహా.. ఇలా తెలుసుకోండి..?

ఒక్కొక్కరి పేరు మీద ఏయే సిమ్ కార్డులు ఉన్నాయో పరిశీలించాలని, ఉపయోగించని, తెలియని నంబర్లు తమ పేరున ఉంటే వాటిని క్యాన్సల్  చేసుకోవాలని అధికారులు కోరడంతో సిమ్ కార్డులను రద్దు చేసేందుకు అనేక దరఖాస్తులు వస్తున్నాయి. 
 

658 SIM cards taken with a single Aadhaar; How to cancel SIMs taken without owners knowledge, here's how-sak
Author
First Published Aug 11, 2023, 9:45 PM IST

ఢిల్లీ : ఓ వ్యక్తి ఆధార్‌ను ఉపయోగించి తమకు తెలియకుండా తీసుకున్న మొబైల్ కనెక్షన్‌లను కనిపెట్టి క్యాన్సల్ చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో అడుగులు పడుతున్నాయి. ఒకే ఆధార్‌తో 100 కంటే ఎక్కువ కనెక్షన్‌లు ఉన్న అనేక ఉదాహరణలు తమిళనాడుతో సహా వివిధ రాష్ట్రాల్లో కనుగొనబడ్డాయి. గత నాలుగు నెలల్లో తమిళనాడు సైబర్ క్రైమ్ వింగ్ 25,135 సిమ్ కార్డులను క్యాన్సల్ చేసింది. నకిలీ గుర్తింపు డాకుమెంట్స్ తో సిమ్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వీటిని క్యాన్సల్ చేశారు.

విజయవాడలో ఓ వ్యక్తి గుర్తింపు కార్డును ఉపయోగించి 658 సిమ్ కార్డులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. షాపులు, కియోస్క్‌లకు మొబైల్ సిమ్‌కార్డులను పంపిణీ చేసే వ్యక్తి పేరిట ఈ  యాక్టివ్ సిమ్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కొక్కరి పేరు మీద ఏయే సిమ్ కార్డులు ఉన్నాయో పరిశీలించాలని, ఉపయోగించని, తెలియని నంబర్లు తమ పేరున ఉంటే వాటిని క్యాన్సల్ చేసుకోవాలని  అధికారులు కోరడంతో సిమ్ కార్డులను క్యాన్సల్ చేసేందుకు అనేక దరఖాస్తులు వస్తున్నాయి. 

సిమ్ కార్డ్‌లను ఉపయోగించి జరుగుతున్న మోసాలను నిరోధించడానికి టెలికాం డిపార్ట్‌మెంట్ ద్వారా ASTR (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్) ప్రవేశపెట్టబడింది. ఇది అనుమానాస్పద SIM కార్డ్‌లను చెక్  చేస్తుంది ఇంకా బ్లాక్ చేస్తుంది. అన్ని టెలికాం ఆపరేటర్‌ల నుండి సిమ్ కార్డ్ హోల్డర్‌ల సమాచారం ఇంకా ఫోటోస్ సేకరించడం అలాగే  వాటిని ఉపయోగించి చేసిన ఇతర కనెక్షన్‌లను మాన్యువల్‌గా గుర్తించడం దీని పద్ధతి. 

టెలికాం శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా వ్యక్తులు తమ పేరు మీద ఉన్న మొబైల్ కనెక్షన్‌లను కూడా కనుగొనవచ్చు. ఇందుకోసం టెలికాం అనాలిసిస్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ పేరుతో పోర్టల్ పనిచేస్తోంది. ఇది ఆధార్‌ను ఉపయోగించి తీసుకున్న కనెక్షన్‌లను కనుగొనగలదు. 

OTPని పొందడానికి https://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్‌కి లాగిన్ చేయండి అలాగే మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్  చేయండి. OTPని ఎంటర్  చేసిన తర్వాత, మీ ఆధార్‌తో తీసుకున్న ఇతర SIM కార్డ్‌ల వివరాలు కనిపిస్తాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios