Asianet News TeluguAsianet News Telugu

13 ఏళ్ల పాత ఫోన్.. 318 రెట్లు ఎక్కువ ధర.. ఆ డబ్బుతో 3 BHK ఫ్లాట్ కొనేందుకు సరిపోతుంది

ఆపిల్ iPhone 4 ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో లేదు. అయితే 2007 సంవత్సరంలో ఈ ఫోన్‌ను కంపెనీ రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. మొదటిది 4GB అండ్ రెండవది 8GB స్టోరేజ్. బేస్ వేరియంట్ కేవలం రెండు నెలలు మాత్రమే మార్కెట్‌లో ఉండి, ఆ తర్వాత కంపెనీ దానిని నిలిపివేసింది.
 

13 years old phone sold 318 times costlier, the price is enough to buy 3 BHK flat-sak
Author
First Published Jul 19, 2023, 5:13 PM IST

 మీరు 16 ఏళ్ల నాటి ఫోన్ కొనుగోలు చేయాల్సి వస్తే ఎంత ఖర్చు చేస్తారు..? ఎందుకంటే దాని కోసం  ఓ వ్యక్తి  ఏకంగా రూ.1.3 కోట్లు చెల్లించాడు. నిజానికి 2007 మోడల్ సీల్డ్ ప్యాక్ ఐఫోన్ 4, దాని అసలు ధర కంటే 318 రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేయబడింది. ఇందుకోసం దాదాపు కోటిన్నర రూపాయలు ఇచ్చారు. ఈ ధరలో ముంబై వంటి నగరంలో విలాసవంతమైన 3BHK  కొనొచ్చు. ఇంత ధర పలికిన ఈ ఫోన్ గురించి ఏమిటో తెలుసుకుందాం.

సీల్డ్ ప్యాక్ ఫోన్  
LCG వేలంలో వేలం వేసిన ఈ ఫోన్ చాలా అరుదైన మోడల్. ఈ ఫోన్ Apple iPhone 4 4GB మోడల్.  ఈ సీల్డ్ ప్యాక్డ్ ఐఫోన్ 4 ఈ ఏడాది జూన్‌లో వేలానికి ఉంచబడింది. జూన్ 30న, ఈ ఫోన్ కోసం బిడ్ $10,000 వద్ద ప్రారంభమైంది, ఇది $1,58,644కి చేరుకుంది. అంటే ఈ ఫోన్ వేలంలో రూ.1 కోటి 30 లక్షల 23 వేల 958 పలికింది. iPhone 4 అసలు ధర $499. ఇప్పుడు అది 318 రెట్లు ఎక్కువ ధరకు విక్రయించబడింది.

ఐఫోన్ 4 ఫీచర్లు

Apple iPhone 4 ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో లేదు. 2007 సంవత్సరంలో, ఈ ఫోన్‌ను కంపెనీ రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. మొదటిది 4GB అండ్ రెండవది 8GB స్టోరేజ్. బేస్ వేరియంట్ కేవలం రెండు నెలలు మాత్రమే మార్కెట్‌లో ఉండి, ఆ తర్వాత కంపెనీ దానిని నిలిపివేసింది. ఐఫోన్ 4లో 3.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ 1420 mAh. 5MP బ్యాక్ కెమెరా,  0.3MP ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్ ప్రపంచ స్థాయిలో చాలా కాలం క్రితం ప్రారంభించబడింది, అయితే ఈ ఫోన్ భారతదేశంలో 2010లో వచ్చింది. ప్రజలు ఫోన్ యొక్క చిన్న డిస్‌ప్లే ఇంకా కాంపాక్ట్ సైజును ఎంతో ఇష్టపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios