పిరెల్లితో పాటు ఎరిక్సన్, ఆడి, టిమ్, ఇటాల్డెజైన్ మరియు కెటిహెచ్ కంపెనీలు ఒక వాహనంకి అమర్చిన పిరెల్లి సెన్సార్  సైబర్ టైర్‌ కి అమర్చబడిన 5 జి నెట్‌వర్క్‌ ఎలా అనుసంధానించబడిందో ప్రదర్శించారు.

5 జి నెట్‌వర్క్ ద్వారా రహదారికి  సంబంధించి ఇంటెలిజెంట్ టైర్ల ద్వారా కనుగొనబడిన సమాచారాన్ని డ్రైవర్ కి  ప్రసారం చేస్తుంది. పిరెల్లి  టైర్ ప్రపంచంలోనే మొట్టమొదటి 5G టైర్ కంపెనీగా నిలిచింది.

also read పెగాసస్ ను మరవక ముందే వాట్సాప్ లో మరో భద్రతా లోపం

పిరెల్లితో పాటు ఎరిక్సన్, ఆడి, టిమ్, ఇటాల్డెసిగ్న్ మరియు కెటిహెచ్ వంటి కంపెనీలు  కూడా సెన్సార్ అమర్చిన పిరెల్లి సైబర్ టైర్‌తో కూడిన  5జి నెట్‌వర్క్‌ అనుసంధానించబడిన కారు దాని టైర్ల ద్వారా కనుగొనబడిన ఆక్వాప్లానింగ్ ప్రమాదాన్ని ఎలా ప్రసారం చేయగలదో ప్రదర్శించింది. 

 

also read  టిక్ టాక్ లో మనమే మేటి... భారత్ కు లేదు పోటీ!

వాహనం, రహదారికి మధ్య ఉన్న ఏకైక స్థానం టైర్. వాహనం టైర్ అమర్చిన సైబర్ సెన్సార్ తో  కూడిన  5జి నెట్‌వర్క్‌  డ్రైవర్‌తో కమ్యూనికేట్ అవుతుంది. అంతర్గత సెన్సార్‌తో కూడిన పిరెల్లి సైబర్ టైర్ భవిష్యత్తులో కారు డైనమిక్ లోడ్ మరియు రహదారి పై  ప్రమాదం, నీటి ఉనికి నుండి కారు టైర్ పట్టు వరకు  5జి నెట్‌వర్క్‌ డేటాతో సమాచారం  అందిస్తుంది.

ఈ సమాచారం ద్వారా కారుకి దాని నియంత్రణ మరియు డ్రైవింగ్ సహాయ వ్యవస్థలను స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా ఇది యజమానుల మొత్తం భద్రతకు రక్షణగా ఉంటుంది.