సంతోషం-ఆనందం, ఉద్యమం-ఉద్వేగం ఇలా అన్నింటికి వేదికగా ఉన్న వాట్సాప్‌ను వదిలి మనిషి ఒక్క సెకను కూడా ఉండలేడు. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలు ఆదివారం నిలిచిపోయాయి.

Also Read:ఆన్‌లైన్ ఆఫర్ల సునామీ: ఫ్లిప్ కార్ట్ వర్సెస్ అమెజాన్ ఒకేసారి

ఫోటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు పంపించడం వీలుకాకపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్ సహా బ్రెజిల్, యూఏఈలలో ఈ పరిస్థితి తలెత్తింది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్ వినియోగదారులు సైతం అవస్థలు పడ్డారు.

దీంతో యూజర్లు ట్విట్టర్ సాయంతో #whatappdown అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఫిర్యాదు చేశారు. అయితే టెక్ట్స్ సందేశాలు మాత్రం యథావిధిగా వెళ్లినట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన వాట్సాప్ దాదాపు రెండు గంటల తర్వాత తన సేవలను పునరుద్ధరించింది.

Also Read:పివిఆర్ సినిమాస్‌లో ఉచితంగా మూవీ టికెట్లు...

భారత కాలమానం ప్రకారం సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ఈ సమస్య తలెల్తింది. తొలుత దీనిని నెట్‌వర్క్ ఫెయిల్యూర్‌గా భావించారు. కానీ ఎప్పుడైతే వాట్సాప్ రంగ ప్రవేశం చేసిందో అప్పుడే ఇది సాంకేతిక సమస్య అని తెలుసుకున్నారు. దీనిపై మీమ్స్ చేసిన వినియోగదారులు ఒక ఆట ఆడుకున్నారు. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.