కొత్త అవార్డు పొందిన ఎపిక్ వార్ మూవీ "1917" ను చూడటానికి ప్లాన్ చేస్తున్నారా? మీరు క్యూరేటెడ్ స్ట్రీమింగ్ సర్వీస్ ముబి యాప్ సభ్యత్వాన్ని పొందినట్లయితే పివిఆర్ సినిమాస్ వద్ద ఉచితంగా టికెట్ తీసుకోవచ్చు. ఎందుకంటే దేశంలోని ఏదైనా పివిఆర్ సినిమాస్ స్క్రీన్‌లో సెలెక్ట్  చేసిన కొత్త సినిమాని చూడటానికి ముబి యాప్ తమ సబ్ స్క్రిబెర్స్ కోసం కాంప్లిమెంటరీ టికెట్‌ను అందిస్తుంది.

ఈ వారం ముబి గో యాప్ లో "1917" సినిమాని సెలెక్ట్ చేసి పివిఆర్ సినిమాస్ లో ప్రదర్శించనున్నారు. 12 ఉచిత టిక్కెట్లకు రూ.199 మాత్రమే. అలాగే ప్రతి వారం ఒక టికెట్ పొందుతారు.ఈ ఆఫర్ కేవలం ఒక వారం మాత్రమే అందుబాటులో ఉంది అది కూడా జనవరి 17 శుక్రవారం నుండి జనవరి 23 వరకు మాత్రమే. 

also read అమెజాన్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు...కొద్దిరోజులు మాత్రమే...


మీ ఫ్రీ సీటు “క్లాసిక్” క్యాటగిరిలో  కేటాయిస్తారు. ఇది కొన్ని పివిఆర్ థియేటర్లలో స్క్రీన్‌కు దగ్గరగా ఉండే మొదటి కొన్ని వరుసలకు మాత్రమే పరిమితం చేయబడింది.పివిఆర్ సినిమాస్‌లో "1917" కోసం మీ ఫ్రీ సినిమా టికెట్ పొందడానికి మీరు చేయాల్సిందల్లా ముబి యాప్ కోసం సైన్ అప్ చేయండి. ఇది భారతదేశంలో కొత్తగా లాంచ్ చేసిన యాప్, ముబి యాప్ మూడు నెలల సబ్ స్క్రిప్షన్ ప్రస్తుత ధర  రూ.199.


ముబి గో అనేది ముబి యాప్ మూడు నెలల సబ్ స్క్రిప్షన్లో ఒక భాగం. తరువాత కాలంలో ముబి యాప్ నెలకు రూ .499, సంవత్సరానికి 4,788 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రతి వారం ఒక సినిమాకి ఫ్రీగా టికెట్ కూడా పొందుతారు.ముబి యాప్ ప్లాట్‌ఫామ్‌లో ఇండియన్ అలాగే  ఇంటర్ నేషనాల్ టైటిల్స్ కూడా అందిస్తుంది. ప్రతి రోజూ ఒక కొత్త చిత్రం ఇందులో అప్ డేట్ అవుతుంది. 

అన్నీ కొత్త సినిమాలు 30 రోజులు పాటు ముబి యాప్ లో అందుబాటులో ఉంటాయి.  ప్రస్తుతం ఫ్రాంకోయిస్ ట్రూఫాట్  ది లాస్ట్ మెట్రో, హృషికేశ్ ముఖర్జీ  నమక్ హరామ్, సత్యజిత్ రే యొక్క ఘరే బైర్ సినిమాలకు కూడా టైటిల్స్ ఉన్నాయి. క్రిస్టి విల్సన్-కైర్న్స్‌తో కలిసి సామ్ మెండిస్ (స్కైఫాల్) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు."1917" సినిమా పాక్షికంగా మొదటి ప్రపంచ యుద్ధం పై కధ ఆధారపడింది.

also read మరో ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు...

1917 నక్షత్రాలు జార్జ్ మాకే (కెప్టెన్ ఫెంటాస్టిక్), డీన్-చార్లెస్ చాప్మన్ (గేమ్ ఆఫ్ థ్రోన్స్), మార్క్ స్ట్రాంగ్ (షాజామ్!), ఆండ్రూ స్కాట్ (షెర్లాక్), రిచర్డ్ మాడెన్ (బాడీగార్డ్), క్లైర్ డబుర్క్, కోలిన్ ఫిర్త్ (ది కింగ్స్ స్పీచ్), మరియు బెనెడిక్ట్ కంబర్‌బాచ్ (డాక్టర్ స్ట్రేంజ్).  "1917" సినిమా 2020 గోల్డెన్ గ్లోబ్స్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇంకా 2020 ఆస్కార్ అవార్డులలో 10 నామినేషన్లుకు ఎంపిక అయింది.