Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ భయంతో ట్విటర్‌ కీలక నిర్ణయం...

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మేసేజింగ్‌ యాప్‌ ట్విటర్‌  తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్విటర్‌ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
.

Twitter announces its employees to work from home to help stop the spread of the coronavirus
Author
Hyderabad, First Published Mar 12, 2020, 5:41 PM IST


సాన్ ఫ్రాన్సిస్కో: ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోని తమ సిబ్బందిని ఇంటి నుండి పని చేయాలని ట్విట్టర్ ఆదేశించింది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మేసేజింగ్‌ యాప్‌ ట్విటర్‌  తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్విటర్‌ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
.
గత ఏడాది చివర్లో  చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు  ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దాదాపు 4,600 మందికి పైగా ఈ కరోనా వైరస్ సోకి మరణించారు. సుమారు 126,000 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు.  

also read టచ్ ఐడితో త్వరలో ఐఫోన్ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్....

ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్‌ మానవ వనరుల విభాగం చీఫ్‌ జెన్నిఫర్‌ క్రైస్ట్‌ బుధవారం వెల్లడించారు.ఇది ఊహించని నిర్ణయమే.. కానీ ప్రస్తుత పరిస్థితులు కూడా ఊహించని విధంగానే ఉన్నాయి’అని  జెన్నిఫర్‌ క్రైస్ట్‌ పేర్కొన్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇప్పటికే ఈ నెల ప్రారంభంలో దక్షిణ కొరియా, హాంకాంగ్, జపాన్లలోని తమ సిబ్బందికి ఇంటి నుండి ఆఫీస్ విధులు నిర్వహించాలని ఇది తప్పనిసరి అని ప్రకటించింది. ఫిబ్రవరిలో "నాన్-క్రిటికల్" బిజినెస్ ప్రయాణలు,  మీటింగ్లను నిలిపివేసింది.

ఇక మిగతా ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులు వైరస్‌ బారిన పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నాయి. సిలికాన్‌ వ్యాలీ, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌లో ఉన్న తన కార్యాలయాలకు ఉద్యోగులు రానవసరం లేదని గూగుల్‌ ఇదివరకే ప్రకటించగా యాపిల్‌ సంస్థ కూడా ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు అవకాశం కల్పించింది.

also read త్వరలో పెరుగనున్నా మొబైల్ డేటా చార్జీలు...టెలికం శాఖ ఆదేశం?!

ఇక సింగపూర్‌, లండన్‌లలో ఉన్న తన కార్యాలయాలలో సంపూర్ణ శుద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఫేస్‌బుక్‌ వాటిని తాత్కాలికంగా మూసేసింది. ఈ రెండు కార్యాలయాల్లో పనిచేసిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక చైనాలో ట్విటర్‌కు బదులు స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌ ‘వీ చాట్‌’ వంటివి ఉన్న సంగతి విదితమే.

ఇతర ఇంటర్నెట్ దిగ్గజాలు సిబ్బందిని  నుండి రక్షించడానికి వారి స్వంత విధానాలను తీసుకువచ్చాయి. గూగుల్ సోమవారం సిలికాన్ వ్యాలీ, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌లోని తమ కార్యాలయాల సందర్శనలను నిలిపివేసింది. ఫేస్ బుక్ ఉద్యోగికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో  గత వారం "డీప్ క్లీనింగ్" కోసం సింగపూర్, లండన్లలోని తమ కార్యాలయాలను మూసివేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios