ప్రముఖ టెక్ దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఆపిల్  కొత్త  ఐఫోన్ 9 పై పుకార్లు వినిపిస్తున్నాయి. ఏంటంటే ఇది ఆపిల్ మొట్టమొదటి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అని, టచ్ ఐడితో సరికొత్త ఇఒస్ 14 కు సపోర్ట్ ఇస్తుందని ఒక ఆన్‌లైన్ నివేదిక సూచించింది.

ఐఫోన్ ఎస్‌ఇ 2 అని కూడా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది జూన్ నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా, ఐఫోన్ 9 లాంచ్ అధికారికంగా జూన్ నెలలో జరగవచ్చని పలు నివేదికలు గుర్తించాయి. ఆపిల్ సంస్థ తన కొత్త డివైజెస్, సర్వీసెస్ గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

also read బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్...కాల్స్, హై-స్పీడ్ డాటా ఫ్రీ....

కొన్ని న్యూస్ వెబ్ సైట్స్ ప్రకారం తాజా పుకార్లు బయటికి వచ్చాయి. ఇది ఇఒస్ 14 డెవలప్‌మెంట్ కోడ్‌ను పరిశీలించిన తరువాత, ఆపిల్ నుండి కొత్త ఐప్యాడ్ ప్రో, ఆపిల్ టివి రిమోట్‌తో సహా కొత్త హార్డ్‌వేర్‌లు రాబోతున్నట్టు సూచించింది. అంతే కాదు ఎయిర్ టాగ్స్, ఐఫోన్ 9లను  కూడా ప్రారంభించబోతున్నట్లు సూచించింది.

also read  8 జీబీ స్టోరేజ్ తో ఆకట్టుకుంటున్న ఒప్పో స్మార్ట్‌ వాచ్‌...


 ఐఫోన్ 6 వినియోగదారులను ఐఫోన్ 9 కి మారాలని ఆపిల్ భావిస్తోందని కూడా ఒక నివేదిక సూచించింది. ఐఫోన్ 9 కాకుండా, నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్ కూడా మంచి కెమెరా సెటప్‌తో వస్తుందని ఊహిస్తున్నారు. కెమెరా సెటప్‌లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ 3డి సెన్సార్, వైడ్ యాంగిల్ లెన్స్, అల్ట్రా వైడ్ లెన్స్, టెలిఫోటో లెన్స్ ఉంటాయి అని ఒక నివేదిక సూచించింది.

గతంలో, ఐఫోన్ 9, లేదా ఐఫోన్ ఎస్ఇ 2 మోడల్  4.7-అంగుళాల ఎల్‌సిడి ప్యానల్‌తో వస్తుందని నివేదికలు సూచించాయి. ఇందులో ఆపిల్  A13 చిప్‌ను ప్యాక్ చేసే అవకాశం ఉంది. ఇందులో 3జి‌బి ర్యామ్ ఉంటుంది. దాని ముందున్న ధరను బట్టి, ఈ మోడల్ $ 399 (సుమారు రూ. 29,200) నుండి ప్రారంభమవుతుందని ఆశించవచ్చు.