Asianet News TeluguAsianet News Telugu

టిక్ టాక్ యాప్ వాడుతున్నారా... జాగ్రత్త, లేదంటే అశ్లీల వీడియోలు...?

ఇండియాలో టిక్ టాక్ ఓ వ్యసనంలా మారిపోయింది. ఎంటర్ టైన్మెంట్, ఫేమ్ కోసం, మనీ ఎర్నింగ్ కోసం అవసరం ఏదైనా  ఇండియాలో స్మార్ట్ మొబైల్ ఉన్న వారిలో 30 కోట్ల మందికి పైగా టిక్ టాక్ వాడుతున్నారు.

tik tok app security bug allowed hackers to take control of user accounts
Author
Hyderabad, First Published Jan 11, 2020, 1:10 PM IST

మీరు టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు చెక్ పాయింట్ రీసెర్చ్ బృందం సభ్యులు.  ఇండియాలో టిక్ టాక్ ఓ వ్యసనంలా మారిపోయింది. ఎంటర్ టైన్మెంట్, ఫేమ్ కోసం, మనీ ఎర్నింగ్ కోసం అవసరం ఏదైనా  ఇండియాలో స్మార్ట్ మొబైల్ ఉన్న వారిలో 30 కోట్ల మందికి పైగా టిక్ టాక్ వాడుతున్నారు.

also read అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : స్మార్ట్ ఫోన్లపై క్రేజీ ఆఫర్

అందులో వచ్చే 15 సెకండ్ల షార్ట్ వీడియో మెసేజ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని అదునుగా భావించిన హ్యాకర్లు  టిక్ టాక్ అకౌంట్లపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 150దేశాల్లో ఈయాప్ ను వినియోగిస్తుండగా..భారత్ లో ఎక్కువ మంది వినియోగదారులున్నారు.

అయితే ఈ యాప్ భద్రతపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. టిక్ టాక్ దేశంలో అస్లీల చిత్రాల్ని ప్రోత్సహిస్తుందంటూ ఏడాది పాటు బ్యాన్ చేశారు. దీంతో టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. అయినా హ్యాకర్లనుంచి యాప్ ను కాపాడలేకపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

tik tok app security bug allowed hackers to take control of user accounts

గతేడాది బగ్ ను గుర్తించిన టిక్ టాక్

గతేడాది నవంబర్ నెలలో  టిక్ టాక్ యూజర్ల డేటాను హ్యాకర్స్ దొంగిలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన టిక్ టాక్  బగ్ ను గుర్తించి డిసెంబర్ 15న సరిచేసింది. టిక్‌టాక్ వినియోగదారులు ఒకసారి అకౌంట్ క్లోజ్ చేసి  వారి పాస్‌వర్డ్‌లను మార్చాలి. దీంతో వారి అకౌంట్లు సురక్షితంగా ఉంటుందని తెలిపింది.  ఐఓఎస్,  ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది.

టిక్ టాక్ భద్రతపై నీలినీడలు

ఇప్పుడు మరోసారి టిక్ టాక్ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి.  అక్రమమార్గంలో సొమ్ము చేసుకునేందుకు హ్యాకర్స్ వినియోగదారుల  వ్యక్తిగత వివరాలు, లాగిన్ ఐడీ పాస్ వర్డ్ లను తస్కరించి  బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మనీని కొట్టేయడం, టిక్ టాక్ లో మహిళలు సెల్ఫీలు దిగితే  వారి వీడియోల్ని, ఫోటోల్ని హ్యాక్ చేసుకొని ఫోటోలు మార్ఫ్ చేస్తున్నారని, మార్ఫ్ చేసిన ఫోటోల్ని అస్లీల వెబ్ సైట్లో పెట్టి సొమ్ము చేసుకుంటున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

also read అంచనాలను బీట్ చేసిన ఇన్ఫోసిస్‌... స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్

టిక్ టాక్ నుంచి మెసేజ్ వచ్చిందని లింక్ ఓపెన్ చేశారా అంతే సంగతలు

టిక్ టాక్ నుంచి  www.tiktok.com నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటూ యూజర్లకు ఎస్ఎంఎస్  పంపే అవకాశం కూడా ఉందని టిక్ టాక్ రిసెర్చ్ బృందం చెక్ పాయింట్ తెలిపింది. టిక్ టాక్ నుంచి వచ్చిందని లింక్ ఓపెన్ చేస్తే హ్యాకర్స్ ఆ లింక్ ద్వారా మాల్వేర్ ను  అకౌంట్లలోకి పంపి హ్యాక్ చేస్తున్నట్లు తేలింది.  ఎంతమంది టిక్ టాక్ యూజర్లకు ఈ రిస్క్ ఉందనే విషయంలో స్పష్టత లేదు. కానీ, మిలియన్ల మంది టిక్ టాక్ యూజర్ల అకౌంట్లు రిస్క్ లో ఉన్నాయని పరిశోధక బృందం గట్టిగా చెబుతోంది.

హ్యాకర్స్ నుంచి తప్పించుకోవాలంటే

హ్యాకర్స్ నుంచి తప్పించుకోవాలంటే యాప్ ను లాగౌట్ చేయాలి. యాప్ ను అప్ డేట్ చేసుకోవాలి. అలా అప్ డేట్ చేసుకుంటే రిస్క్ తక్కువగా ఉంటుందని చెక్ పాయింట్ తెలిపింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios