అంచనాలను బీట్ చేసిన ఇన్ఫోసిస్‌... స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్

ఇన్ఫోసిస్ అంచనాలను బీట్ చేసింది. మూడో త్రైమాసికంలో 23.5 శాతం లాభాలను గడించింది. రెవెన్యూ గైడెన్స్ కూడా 10-10.5 శాతానికి పెంచేసింది. 

Infosys Q3 profit jumps 23.5% to Rs 4,457 cr; revenue guidance raised to 10-10.5%

బెంగళూరు: దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్‌ మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికానికి కంపెనీ లాభం 23.7 శాతం వృద్ధి చెంది రూ.4,466 కోట్లకు చేరుకుంది. 

గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి లాభం రూ.3,610 కోట్లుగా నమోదైంది. సెప్టెంబర్ నెలతో ముగిసిన రెండో త్రైమాసికంతో పోలిస్తే మాత్రం లాభం 10.89 శాతం పెరిగింది.సమీక్షా కాలానికి ఇన్ఫోసిస్ ఆదాయం 7.9 శాతం పెరిగి రూ.23,092 కోట్లకు చేరుకుంది. 2018-19లో ఇదే సమయానికి రూ.21,400 కోట్ల రాబడి గడించింది. కంపెనీ పనితీరు మెరుగైన నేపథ్యంలో ఆదాయ అంచనాలను సైతం ఇన్ఫోసిస్ సవరించింది. 

also read ఇప్పటి నుంచి ట్విటర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు....ఎలా అంటే ?

ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయ అంచనాను గతంలో పేర్కొన్న 9-10 శాతం నుంచి 10-10.5 శాతానికి పెంచింది ఇన్ఫోసిస్. గతంలో 21-23 శాతంగా అంచనా వేసిన నిర్వహణ మార్జిన్‌ రేటును మాత్రం యథాతథంగా కొనసాగించింది.
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడిచిన మూడు త్రైమాసికాలకు ఇన్ఫోసిస్‌ నిర్వహణ లాభం వార్షిక ప్రాతిపదికన 0.6 శాతం పెరిగి 204.9 కోట్ల డాలర్లకు చేరుకుంది. నిర్వహణ మార్జిన్‌ 21.4 శాతంగా నమోదైంది. ఆదాయం 9.7 శాతం వృద్ధితో 958.3 కోట్ల డాలర్లకు పెరిగింది.
 
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికానికి అమెరికన్‌ కరెన్సీలో ఇన్ఫోసిస్ నికర లాభం 24.8 శాతం పెరిగి 62.7 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఆదాయం 8.6 శాతం వృద్ధితో 324 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఇందులో డిజిటల్‌ సేవల రెవెన్యూ 131.8 కోట్ల డాలర్లు. ఈ సేవల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 40.8 శాతం, త్రైమాసిక ప్రాతిపదికన 6.8 శాతం వృద్ధి చెందింది.

Infosys Q3 profit jumps 23.5% to Rs 4,457 cr; revenue guidance raised to 10-10.5%
 
శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిశాక ఇన్ఫోసిస్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించినా కంపెనీ ఫలితాలపై సానుకూల అంచనాలు ఉండటంతో షేర్లు పుంజుకున్నాయి. వారాంతం ట్రేడింగ్‌ ముగిసేసరికి 1.47 శాతం పెరిగి రూ.738.25 వద్దకు చేరుకుంది.
 
ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘క్లయింట్లతో సత్సంబంధాలు నెరపడంతోపాటు వారితో అనుబంధాన్ని విస్తృత పరుచుకునే ప్రయాణంలో నిలకడగా ముందుకెళ్తున్నామని మూడో త్రైమాసిక ఫలితాలు మరింత నొక్కి చెబుతున్నాయి. ఇది కంపెనీ లాభాల్లో రెండంకెల వృద్ధికి, నిర్వహణ మార్జిన్‌ మెరుగుపడటానికి దోహదపడింది. ఆదాయ అంచనాలు పెంచేందుకు బాటలు వేసింది’ అని అన్నారు. 

ఇన్ఫోసిస్‌ సీఓఓ ప్రవీణ్‌ రావు మాట్లాడుతూ ‘భారీ కాంట్రాక్టు ఒప్పందాలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 56 శాతం వృద్ధి చెందాయి. ఉద్యోగులతో అనుబంధం, వారి విలువను మరింత పెంచేందుకు కొనసాగుతున్న ప్రయత్నాల ఫలితంగా వలసల రేటును మరింత తగ్గించుకోగలిగాం’ అని వివరించారు. 

also read ఫ్లిప్‌కార్ట్ నుండి కొత్త స్లిమ్ ల్యాప్‌టాప్‌.... ధర ఎంతో తెలుసా...?

కంపెనీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరుగుతున్నట్లు అమెరికాకు చెందిన విజిల్‌బ్లోయర్‌ ఆరోపణలపై నిగ్గు తేల్చడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆడిట్‌ కమిటీకి ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టంచేసింది. సంస్థ అంతర్గత విచారణలో భాగంగా ఏర్పాటు చేసిన ఆడిట్‌ కమిటీ గత మూడు నెలలుగా అన్ని రకాలుగా విచారించినా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇన్ఫోసిస్‌ ఆడిట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ డీ సుందరం ఒక ప్రకటనలో తెలిపారు.

విజిల్‌బ్లోయర్‌ లేవనెత్తిన ఆరోపణలపై ఈ కమిటీ స్వతంత్రంగా విచారించింది. ఈ ఆడిట్‌ కమిట్‌లో ఇండిపెండెంట్‌ లీగల్‌ కౌన్సిల్‌ శారదుల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కో, ప్రైస్‌వాటర్‌ హౌజ్‌ కూపర్‌ ఉన్నాయి. అక్టోబర్‌ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు విడుదల చేసేసమయంలో విజిల్‌బ్లోయర్‌ అనుమానాలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios