ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్  సంక్రాతి  పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైంది.  అందులో భాగంగా అమెజాన్ ఫస్ట్  గ్రేట్ ఇండియన్ సేల్ 2020ని  ప్రకటించింది. సంక్రాంతి పండుగ తరువాత అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.  

also read అంచనాలను బీట్ చేసిన ఇన్ఫోసిస్‌... స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్

 స్మార్ట్‌ఫోన్స్ , ల్యాప్‌టాప్స్, కెమెరాలు, టీవీలు మరియు ఇతర గాడ్జెట్‌లపై గొప్ప ఆఫర్లను తీసుకువచ్చే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ యొక్క సెలబ్రేషన్ స్పెషల్‌ను అమెజాన్ ఇండియా ప్రకటించింది. అమెజాన్  గ్రేట్ ఇండియన్ సేల్స్  జనవరి  19న  ప్రారంభమై జనవరి 22  వరకు కొనసాగనుంది.  

అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటలకు ముందే అంటే జనవరి మధ్యాహ్నం 12గంటల నుండి  ప్రత్యేకమైన యాక్సిస్ లభిస్తుంది. అమెజాన్ మరియు ఎస్బీఐ బ్యాంక్‌ భాగస్వామ్యంతో దాని క్రెడిట్  కార్డులపై ఈ సేల్స్ సమయంలో 10 శాతం తక్షణ తగ్గింపు అందిస్తుంది.

 ఫెస్టివల్ సేల్స్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్స్ అందించనుంది.    ఒప్పో, శాంసంగ్, షియోమి, రీయల్ మి, ఎల్జీ, మరియు వివోలతో పాటు పలురకాలనై  స్మార్ట్ ఫోన్ల పై ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు అతి తక్కువ కాస్ట్ తో నెలకు రూ.833ల  ఈఎంఐ సౌకర్యం ఉంది.      

also read ఇప్పటి నుంచి ట్విటర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు....ఎలా అంటే ?

రెడ్ మీ నోట్ 8, వన్ ప్లస్ టీ7 న్యూ స్మార్ట్ ఫోన్స్ పై 12నెలల నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ ట్రా డిస్కౌంట్, ఎక్సేంజ్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం30, వివో యూ20లపై  సేల్స్ ను ప్రకటించింది. గ్రేట్ ఆఫర్స్ లో యాపిల్ సంస్థకు చెంది ఐఫోన్ ఎక్స్ ఆర్ ఉన్నట్లు చెప్పిన అమెజాన్  త్వరలో పూర్తివివరాల్ని వెల్లడించనుంది.

మొబైల్స్ యాక్ససరీస్ ప్రారంభ ధర అతితక్కువ ప్రైస్ రూ.69కే అమ్మనుంది . ఆన్ లైన్ సేల్స్ లో  హెచ్‌ఎండి గ్లోబల్, రియల్‌మే, హువావే, హానర్, ఒప్పో, ఎల్‌జిలను  త్వరలో విడుదల చేయనుంది.
 అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కోసం ప్రత్యేకంగా  ఇ-టైలర్  ట్యాబ్ ను ఏర్పాటు చేసి త్వరలో  సంబంధిత ఆఫర్లను ప్రకటించనుంది. ఈ ఆఫర్ కోసం ఇ-టైలర్ ఆప్షన్ లో చెక్ చేసుకోవచ్చని అమెజాన్ ఇండియా వివరించింది.