Asianet News TeluguAsianet News Telugu

స్మార్ట్‌ఫోన్ కంటే సన్నగా వన్‌ప్లస్ కొత్త టీవీలు..

స్మార్ట్ అండ్ స్లిమ్ టీవీలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘వన్ ప్లస్’ వీటిని వచ్చేనెల రెండో తేదీన ఆవిష్కరిస్తోంది. అమెజాన్ సంస్థ నుంచి ప్రీ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. 
 

OnePlus TV 2020 Will Be Thinner Than OnePlus 8 Series:Pete Lau
Author
Hyderabad, First Published Jun 27, 2020, 1:04 PM IST

న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ వన్‌ప్లస్ తీసుకురానున్న టీవీలపై భారీ అంచనాలు వెలువడుతున్నాయి. తాజాగా వన్‌ప్లస్ టీవీలు తదుపరి సిరీస్ వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ కంటే సన్నగా ఉండబోతున్నాయని వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అసలు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు అంటేనే స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్‌కి పెట్టింది పేరు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వన్‌ప్లస్ టీవీలు ఇంకెంత సన్నగా ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది.  

తమ రానున్న టీవీల్లో అల్ట్రా-సన్నని డిజైన్ ఉంటుందని, డిజైన్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనే రెండు కీలక అంశాలపై దృష్టి సారించినున్నట్లు వన్ ప్లస్ సీఈఓ పీట్ లా తెలిపారు. కేవలం 6.9 మి.మీ మందంతో తీసుకు రానున్నామని ఆండ్రాయిడ్ సెంట్రల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పరు. 

అంతేకాదు ఫ్లాగ్‌షిప్ క్యూ1 టెలివిజన్ కంటే తక్కువగా అందుబాటు ధరలో 20 వేల రూపాయలకు అందించనున్నామని వన్ ప్లస్ సీఈఓ పీట్ లా చెప్పారు. ఈ కొత్త టెలివిజన్ సెట్లను వచ్చేనెల రెండో తేదీన ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.  

also read అమెజాన్‌ పేలో సరికొత్త ఫీచర్.. ఇక పేమెంట్లు మరింత సులభంగా! ...

కొత్త స్మార్ట్ టీవీలో 95 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో సన్నని బెజెల్స్‌ ఫీచర్, కొత్తం సౌండ్ సిస్టం, స్పీకర్లు 90 డిగ్రీల కోణంలో రొటేట్ అయ్యేలా రూపొందించామని వన్ ప్లస్ సీఈఓ పీట్ లా తెలిపారు. సినిమాటిక్ డిస్‌ప్లే, డాల్బీ విజన్‌, నెట్‌ఫ్లిక్స్ యాప్‌ లాంటి ఫీచర్లను  హైలైట్ చేస్తూ గత వారమే పీట్ లా ట్వీట్‌ చేశారు. 

వన్‌ప్లస్ టీవీలు 32, 43-అంగుళాల వేరియంట్లలో విడుదల కానున్నాయి. ప్రారంభ ధర రూ. 20 వేలు ఉంటుందని అంచనా. ప్రస్తుతం, కొత్త వన్‌ప్లస్ టీవీలు అమెజాన్ ఇండియాలో ప్రీ-బుకింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి.

వన్ ప్లస్ టీవీలను ప్రీ-బుక్ చేసుకునే వినియోగదారులకు బీమా సంస్థ అకో నుండి రెండేళ్లపాటు వారంటీ లభిస్తుందని వన్ ప్లస్ కంపెనీ పేర్కొంది. కాగా 2019లో స్మార్ట్ టీవీ పరిశ్రమలోకి ప్రవేశించిన వన్‌ప్లస్ క్యూ 1 సిరీస్ టీవీ ప్రారంభ ధర రూ. 69,900 పలుకుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios