సారాంశం

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, టెలికాం సంస్థ నోకియాతో కలిసి అథీనా ల్యాండర్‌ను ప్రయోగించింది. ఈ మిషన్ పేరు IM-2 అంటే Intuitive Machine-2. ఇది చంద్రుడిపై మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తుంది. ఇంతకీ చంద్రుడిపై ఇంటర్నెట్ ఎందుకనేగా మీ సందేహం.. 

ప్రస్తుతం ప్రపంచమంతా మొబైల్ నెటవర్క్‌, ఇంటర్నెట్ సేవలు విస్తరిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో కూడా ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంటర్నెట్ సేవలు పెరగడంతో భారత్‌తో సహా చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డిజిటల్ విప్లవం వచ్చింది. ఇది మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను సులభతరం చేసింది. ఈ కమ్యూనికేషన్ విప్లవం ఇప్పుడు చంద్రుడిపై కూడా జరగబోతోందని మీకు తెలుసా.? ఈ దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయి. 

దీని కోసం అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా గురువారం చంద్రుడిపైకి అథీనా ల్యాండర్‌ను పంపింది. దీని సహాయంతో చంద్రడిపైన మొబైల్‌, ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, టెలికాం సంస్థ నోకియాతో కలిసి అథీనా ల్యాండర్‌ను ప్రయోగించింది. ఈ మిషన్ పేరు IM-2 అంటే Intuitive Machine-2. ఇది చంద్రుడిపై మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తుంది. నాసా గురువారం ఉదయం 7 గంటలకు (అక్కడి స్థానిక కాలమాణ ప్రకారం) ఫ్లోరిడాలోని ఫాల్కన్-9 రాకెట్ నుంచి ఈ నోవా-సి క్లాస్ చంద్ర ల్యాండర్ (అథీనా ల్యాండర్)ను చంద్రుడిపైకి పంపింది.

మార్చి 6న ఈ అథీనా ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరుకుంటుంది. నాసా ఈ మిషన్ కోసం, నోకియా కంపెనీకి చెందిన నోకియా బెల్ ల్యాబ్స్ చంద్రుడి కోసం మొట్టమొదటి సెల్యులార్ నెట్‌వర్క్ LSCSని తయారు చేసింది. (చంద్రుడిపై సెల్యులార్ నెట్‌వర్క్) ఇది వ్యోమగాములతో నిరంతరాయంగా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా వ్యోమగాములు వాయిస్ కాల్స్‌తో పాటు ఇంటర్నెట్ సేవలను కూడా వాడుకోవచ్చు.  

 

ఏం చేస్తారు.? దీంతో ఏంటి లాభాం.? 

నోకియా వెబ్‌సైట్ ప్రకారం చంద్రుడిపై నోకియా LSCS నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. నాసా చంద్రుడిపై ఏర్పాటు చేసే నోకియా నెట్‌వర్క్ LSCS 4G వేగంతో (4G/LTE) ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. అథీనా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన వెంటనే నోకియా LSCSని యాక్టివేట్ చేస్తుంది. ఇది Intuitive Machine డైరెక్ట్-టు-ఎర్త్ లింక్‌ను ఉపయోగించి LSCS సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభిస్తుంది. 

తర్వాత 'నెట్‌వర్క్ ఇన్ ఎ బాక్స్' (NIB)ని యాక్టివేట్ చేస్తుంది. ఆ తర్వాత ఇది భూమిపై ఉన్న నోకియా మిషన్ కంట్రోల్ సెంటర్‌కు టెలిమెట్రీ డేటాను పంపడం మొదలు పెడుతుంది. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత, NIB లూనార్ అవుట్‌పోస్ట్ యొక్క MAPP రోవర్‌లోని డివైజ్ మాడ్యూల్‌తో డైరెక్ట్ సెల్యులార్ లింక్‌ను ఏర్పాటు చేస్తుంది.

దీన్ని చంద్రుడిపై మొదటి సెల్యులార్ కాల్‌గా అభివర్ణిస్తున్నారు. ఆ తర్వాత NIB మరొక Intuitive Machineలోని మైక్రో నోవా హాప్పర్‌కు కనెక్ట్ అవుతుంది. చంద్రుడిపై మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో వ్యోమగాములకు, వారి పరిశోధనలకు అంతరిక్షాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావచ్చని నోకియా చెబుతోంది. 

YouTube video player