ఇండియాలో ఎంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారో తెలుసా....?
దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. 2014లో 828 మిలియన్ల జీబీగా ఉన్న డేటా వినియోగం.. ఈ ఏడాది తొలి 9 నెలల్లో 54,917 మిలియన్ల జీబీకి పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో డేటా వినియోగం పెరిగేందుకు ట్రాయ్ చెబుతున్న కారణాలు ఇవే...
న్యూఢిల్లీ: భారత్లో భారీఎత్తున డేటాను వినియోగించినట్లు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. సెప్టెంబర్ వరకు విడుదలైన సమాచారం ప్రకారం 54,917 మిలియన్ల జీబీ డేటాను వినియోగించినట్లు తేలింది. ఈ డేటా వినియోగం 2014లో కేవలం 828 మిలియన్ల జీబీ మాత్రమే ఉండగా.. 2018 నాటికి 46,404 మిలియన్ల జీబీకి చేరింది.
also read ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో మార్పు....
2019లో ఇప్పటివరకు వచ్చిన లెక్కలను చూస్తేనే గత ఏడాది డేటాను ఎప్పుడో దాటేసింది. ఇక వైర్ లెస్ ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 2014లో 281.58 మిలియన్లు ఉంది. 2019 సెప్టెంబర్ నాటికి 664.80 మిలియన్లకు చేరింది. 2017కు 2018కి వీరి సంఖ్య దాదాపు 36.36శాతం పెరిగింది. 2017లో డేటా వినియోగం కంటే 2018లో డేటా వినియోగం రెట్టింపు కావడం విశేషం.
2016కు డేటా వినియోగం 4642 మాత్రమే ఉంది. ట్రాయ్ విశ్లేషిస్తూ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది.ఈ నాలుగేళ్లలో వైర్లెస్ డేటా వినియోగం ఊహకందని స్థాయిలో పెరిగిపోయిందని ట్రాయ్ అభిప్రాయపడింది. 4జీ రాకతో నెమ్మదిగా ఆ టెక్నాలజీ ఉన్న పరికరాలు కూడా పెరగడంతో ఇంటర్నెట్ డేటా వినియోగం భారీ ఎగసింది.
also read 2020 చివరికల్లా 5జీ స్పెక్ట్రం.. వేలం...
ఈ క్రమంలో దేశంలోని చాలా ప్రాంతం 2జీ నుంచి 4జీ అప్ గ్రేడ్ కావడం కూడా కీలక పాత్ర పోషించింది. దీంతోపాటు తక్కువ దరలకు ఫోన్లు కూడా లభించడంతో వినియోగించే వారి సంఖ్య పెరిగింది. అయితే 2016లో జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత.. డేటా ఛార్జీలు భారీగా తగ్గి వైర్లెస్ డేటా వినియోగం ఈ స్థాయిలో పెరిగినట్లు టెలికాం నిపుణులు చెబుతున్నారు.