ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో మార్పు....
ఎయిర్‌టెల్ రూ. 558 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ ప్రయోజనాలు రోజుకు 3GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లు, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్.ఎయిర్‌టెల్ ఇటీవలే ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వై-ఫై కాలింగ్ సేవను ప్రవేశపెట్టింది, వినియోగదారులకు సాధారణ వాయిస్ కాల్ లాగానే వై-ఫై నెట్‌వర్క్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 558 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ సవరణ చేసింది. టెలికాం ఆపరేటర్ ఈ నెల ప్రారంభంలో దాని మొత్తం పోర్ట్‌ఫోలియోను సవరించారు. ఇప్పుడు ఎయిర్‌టెల్ రూ. 558 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీని తగ్గించింది. కానీ దాని మిగతా ప్రయోజనాలన్నీ అలాగే ఉన్నాయి.
also read 2020 చివరికల్లా 5జీ స్పెక్ట్రం.. వేలం...
ఎయిర్‌టెల్ ఇటీవలే ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వై-ఫై కాలింగ్ సేవను ప్రవేశపెట్టింది, వినియోగదారులకు సాధారణ వాయిస్ కాల్ లాగానే వై-ఫై నెట్‌వర్క్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు.దీనికి ప్రత్యేక యాప్ అవసరం లేదు. వినియోగదారులు కాల్స్ చేసేటప్పుడు చేయవలసింది Wi-Fi కాలింగ్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.
ఎయిర్‌టెల్ రూ. 558 ప్రీపెయిడ్ ప్లాన్, ప్రయోజనాలు నిజంగా ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 3 జిబి డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్. అయితే దీని వాలిడిటీ 82 రోజుల నుండి 56 రోజులకు తగ్గించారు అంటే 26 రోజుల వాలిడిటీని తగ్గించారు. ఈ ప్లాన్ అదనపు ప్రయోజనాలు ఏంటంటే షా అకాడమీలో ఉచితంగా నాలుగు వారాల పాటు ఫోటోగ్రఫీ, సంగీతం ఇంకా ఏదైనా నేర్చుకోవచ్చు.
also read గూగుల్ క్రోమ్ వాడుతున్నారా... అయితే మీరు తప్పకుండ చదవాల్సిందే...
కానీ ఈ ప్లాన్ ప్రయోజనాల వాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే. ఇతర యాడ్-ఆన్‌లలో వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, జీ 5, హెచ్‌ఓఓకే, 370+ లైవ్ టివి ఛానెల్‌లు, 10వేలకి పైగా చలనచిత్రాల నుండి కంటెంట్‌ను అందించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఇస్తుంది. ఈ ప్యాక్‌లో ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ. 100 క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. సవరించిన ఎయిర్‌టెల్ రూ. 558 ప్యాక్ అన్ని సర్కిల్‌లలో లభిస్తుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఎయిర్‌టెల్ ఇటీవల మరో ఆరు ఫోన్‌లకు వై-ఫై కాలింగ్ సపోర్ట్ అందిస్తోంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 10, గెలాక్సీ ఎస్ 10 +, గెలాక్సీ ఎస్ 10 ఇ, గెలాక్సీ ఎం 20, అలాగే వన్‌ప్లస్ 6, వన్‌ప్లస్ 6 టి వీటిని వాయిస్ ఓవర్ వైకి మార్చడానికి సపోర్ట్ చేస్తుంది. ఈ సర్విస్ ప్రస్తుతం ఢిల్లీ/ ఎన్‌సిఆర్‌లో మాత్రమే ప్రత్యక్షంగా ఉంది, అయితే ఇది త్వరలో అన్ని ప్రధాన నగరాలకు అందుబాటులోకి వస్తుంది.