కరోనా వైరస్ లక్షణాలు బయట పడకముందు గూగుల్ ఉద్యోగి కొన్ని గంటల ముందు బెంగళూరు కార్యాలయంలో ఉన్నారని గూగుల్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.బెంగళూరు కార్యాలయంలోని ఒక ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు గూగుల్ ఇండియా ధృవీకరించింది. అయితే ఆ ఉద్యోగికి లక్షణాల బయటపడక ముందు ఉద్యోగి కొన్ని గంటలపాటు బెంగళూరు కార్యాలయంలో ఉన్నారని గూగుల్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

"మా బెంగళూరు కార్యాలయానికి చెందిన ఒక ఉద్యోగికి కరోనా వైరస్ (COVID-19) ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అతను కరోనా వైరస్ పరీక్షలు చేయించక ముందు కొన్ని గంటలు మా బెంగళూరు కార్యాలయంలో ఉన్నారు. అప్పటి నుంచి ఉద్యోగి నిర్బంధంలో ఉన్నారు, అతనితో ఎవరైనా సహోద్యోగులు కలిసి ఉన్నారా ? లేదా ఉద్యోగితో సన్నిహిత సంబంధాలు ఉన్నా  వారు వారి ఆరోగ్యా విషయంపై కరోనా వైరస్ టెస్టులు చేయించుకోవాలని గూగుల్ ఇండియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

also read కరోనా వైరస్ పై ఉద్యోగులకు ఆపిల్ సి‌ఈ‌ఓ సలహా...

సౌదీ అరేబియా దేశం నుండి తిరిగి వచ్చిన 76 ఏళ్ల వ్యక్తి మరణించడంతో కర్ణాటక భారతదేశంలో మొట్టమొదటి కరోనావైరస్ మరణాన్ని గురువారం నివేదించింది.టెక్ దిగ్గజాలు మైండ్ట్రీ, డెల్ సంస్థలోని ఇద్దరు ఉద్యోగులకు కరోనావైరస్  పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు తేలింది.

గూగుల్ ఇండియా శుక్రవారం మాట్లాడుతూ బెంగళూరు కార్యాలయంలోని ఉద్యోగులను రేపటి నుంచి ఇంటి నుండి పని చేయలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రతకు మేము ప్రాధాన్యత ఇస్తు, ప్రజారోగ్య అధికారుల సలహాలను అనుసరించి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము అని అన్నారు.

also read చైనాలో తిరిగి తెరుచుకొనున్న ఆపిల్ ఐఫోన్ స్టోర్లు....

భారతదేశంలో మొత్తం ధృవీకరించిన కరోనావైరస్ కేసులు 74, ఒక్క కర్ణాటకలో 4 కేసులు నమోదయ్యాయి. తాజా కరోనా వైరస్  కేసులు మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. భారతదేశంలో నమోదైన 74 కేసులలో 16 ఇటాలియన్ పర్యాటకులు, ఒక కెనడియన్ కూడా ఉన్నారు.  

రాష్ట్రాల వారీగా ఉత్తర ప్రదేశ్ 10, కర్ణాటకలో నాలుగు, మహారాష్ట్ర 11, లడఖ్ లో మూడు కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ లో ఒక్కొక్కటి కేసు నమోదయ్యాయి. కేరళలో గత నెలలో డిశ్చార్జ్ అయిన ముగ్గురు రోగులతో సహా 17 కేసులు నమోదయ్యాయి.