కరోనా వైరస్ పై ఉద్యోగులకు ఆపిల్ సిఈఓ సలహా...
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మార్చి 9 నుండి 13 వరకు సంస్థ ఉద్యోగులు వీలైనంతవరకు ఇంటి దగ్గర నుంచే పనిచేయడానికి ప్రయత్నించండి అని ప్రపంచ కార్యాలయాల్లో పని చేసే తమ ఉద్యోగులకు చెప్పారు.
ఆపిల్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఈఓ) టిమ్ కుక్ గ్లోబల్ ఆఫీసులలో పని చేసే చాలా మందికి ఇంటి నుండి పని చేసే సౌకర్యాన్ని అందించారు. కరోనావైరస్ వ్యాప్తిని మరింతగా వ్యాప్తి చెందకుండా అలాగే తమ ఉద్యోగులు దాని బారిన పడకుండా ఉండడానికి కంపెనీ ఉద్యోగులకి ఈ సలహా ఇచ్చరు.
also read రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్....ఎక్కువ రోజుల వాలిడిటీతో....
ఒక ఇంగ్లిష్ న్యూస్ పత్రికకు టిమ్ కుక్ పంపిన మెమో ప్రకారం, మార్చి 9 నుండి 13 వ వారకు మీ ఉద్యోగ పనులను వీలైనంతవరకు ఇంటి నుంచే పనిచేయడానికి ప్రయత్నించండి అని కుక్ ప్రపంచ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులకు చెప్పారు. ఇది కాలిఫోర్నియా, సీటెల్‌లోని ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయడానికి వీలు కల్పించింది.
ఈ విధానం కరోనా వైరస్ అంటువ్యాధి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉండేవారికి వర్తిస్తుంది. కాలిఫోర్నియా, సీటెల్, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, శాంటా క్లారా వ్యాలీ, ఎల్క్ గ్రోవ్ ప్రాంతాల్లోని సంస్థ కార్పొరేట్ కార్యాలయాలకు కుక్ చెప్పారు.
also read మీ డెబిట్/క్రెడిట్ కార్డులు 16లోపు వాడండి లేదంటే...
జ్వరం లేదా దగ్గు ఉన్న ఉద్యోగులు వారు కోలుకునే వరకు ఆఫీసులకు రాకుండా ఉండాలని, చేతులు తరచూ కడుక్కోవాలని, కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాల నుండి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత తగిన జాగ్రత్తలు అనుసరించాలని ఆపిల్ టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.
కరోనా వైరస్ కారణంగా కంపెనీ ఇప్పటికే ఐఫోన్లు, ఐప్యాడ్ ప్రోల సరఫరా నిలిపి వేసింది. అలాగే వాటి ఉత్పత్తిలో కూడా ఆలస్యం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పీల్ సంస్థ చైనాలోని మొత్తం 42 రిటైల్ దుకాణాలను తాత్కాలికంగా మూసి వేసింది. కాని ఇప్పుడు మళ్ళీ ఒకొక్కటి తేర్చుకుంటున్నాయి.