Asianet News TeluguAsianet News Telugu

చైనాలో తిరిగి తెరుచుకొనున్న ఆపిల్ ఐఫోన్ స్టోర్లు....

చైనాలో కరోనావైరస్ పరిస్థితి మెరుగుపడటంతో దేశంలోని అన్నీ ఆపిల్  రిటైల్ స్టోర్లు తిరిగి తేర్చుకున్నాయి. అయితే  ఆపిల్ ఫిబ్రవరి 9న స్టోర్లను తిరిగి తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికి, కాని ఆ తేదీని మరి కొన్ని రోజులకు పొడిగించింది. 

Apple Reopens All its Retail Stores in china As Coronavirus Situation Improves
Author
Hyderabad, First Published Mar 13, 2020, 11:53 AM IST

 చైనాలో కరోనావైరస్ పరిస్థితి మెరుగుపడటంతో దేశంలోని అన్నీ ఆపిల్  రిటైల్ స్టోర్లు తిరిగి తేర్చుకున్నాయి. చైనాలో ఆపిల్  రిటైల్  స్టోర్లను మూసివేయడం, సరఫరాలో ఆలస్యం, నిలిపివేత వంటివి దేశంలో ఐఫోన్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపించింది.

చైనాలోని ప్రధాన భూభాగంలో కరోనా వైరస్ పరిస్థితి కాస్త మెరుగుపడటంతో, దేశంలోని అన్నీ ఆపిల్ 42 రిటైల్ స్టోర్లు తిరిగి తేర్చుకున్నాయి. ప్రముఖ ఆరోగ్య నిపుణుల సలహా ఆధారంగా టెక్ దిగ్గజం ఫిబ్రవరి 1 నుండి దేశంలోని అన్ని రిటైల్ స్టోర్లను మూసివేసిన విషయం తెలిసిందే.

also read  కరోనా వైరస్ భయంతో ట్విటర్‌ కీలక నిర్ణయం...

అయితే  ఆపిల్ ఫిబ్రవరి 9న స్టోర్లను తిరిగి తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికి, కాని ఆ తేదీని మరి కొన్ని రోజులకు పొడిగించింది. చైనాలో ఆపిల్  రిటైల్  స్టోర్లను మూసివేయడం, సరఫరాలో ఆలస్యం, నిలిపివేత వంటివి దేశంలో ఐఫోన్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపించింది.

కరోనావైరస్ చైనా దేశం పక్క దేశాలకు వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా వైరస్ వ్యాప్తిని అన్నీ దేశాలకు ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ సప్లయి సమస్యలు, ఐఫోన్ 11 ప్రో, 11 మాక్స్ వంటి కొత్త ఆపిల్ ఐఫోన్లను యుఎస్ లోని రిటైల్ స్టోర్లలో స్టాక్ తగ్గాయి అని కొన్ని నివేదికలు తెలిపాయి.

also read టచ్ ఐడితో త్వరలో ఐఫోన్ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్....

కొన్ని వారాలుగా ఆపిల్ స్టోర్లలో ఐఫోన్‌ల స్టాక్ అయిపోయింది. కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుందో కూడా వారికి తెలియదు. ఒక నివేదిక ప్రకారం, వైర్‌లెస్ రిటైలర్లలో స్టాక్ కూడా అయిపోయింది. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో మోడళ్ తక్కువ స్టాక్ తో నడుస్తున్నాయి. ఏదేమైనా చైనాలో కరోనా వైరస్  వ్యాప్తి కాస్త తగ్గడంతో ఆపిల్ కంపెనీ  ఉత్పత్తిని నెమ్మదిగా పెంచడం ప్రారంభించాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios