ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు గుడ్ న్యూస్..ఉచితంగా డిస్నీ, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌..

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పుడు మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడంతో ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ ప్రకటించింది. 

airtel offer free subscrition to hotstar and disney with rs 401 prepaid recharge

ముంబై: దేశం మొత్తం  లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకే పరిమితులయ్యారు. దీంతో ప్రజలు ఇంట్లో ఉంటూ ఇంటర్నెట్, సోషల్ మీడియాపైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పుడు మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడంతో ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ ప్రకటించింది. రూ.401 డేటా ప్లాన్‌ఫై ఉచితంగా డిస్నీ, హాట్‌స్టార్‌ వీఐపీ యాప్లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ను అందిస్తోంది.

హాట్‌స్టార్‌తో కలిసి డిస్నీ ఇటీవల భారత్‌లో అడుగుపెట్టిన విషయం మీకు తెలిసిందే.అయితే ఇప్పుడు రూ.401 కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా డేటా బెనిఫిట్స్‌తో పాటు  'డిస్నీ, హాట్‌స్టార్' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఎయిర్‌టెల్‌ వినియోగదారులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. 'డిస్నీ, హాట్‌స్టార్' తెలుగు సహా పలు భారతీయ భాషల్లో కంటెంట్‌ని అందిస్తోంది.

వీటిని మీరు ఉచితంగానే వీక్షించవచ్చు. రూ.401 డేటా ప్యాక్‌తో ఎలాంటి వాయిస్‌ కాలింగ్‌, ఎస్‌ఎం‌ఎస్ ప్రయోజనాలు ఉండవు. ఈ ప్లాన్‌ ద్వారా కేవలం 28 రోజుల పాటు రోజుకు ౩జీబీ డేటా లభించనుంది.

ఈ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ఒక సంవత్సర కాలం పాటు వర్తించనుంది. సాధారణంగా డిస్నీ, హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ధర  ఏడాదికి రూ.399.  అంటే ప్రతి రోజు అందించే 3 జీబీ డేటా కోసం కేవలం రూ.2 మాత్రమే అదనంగా చెల్లిస్తే సరిపోతుంది.

ఒకవేళ మీరు ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ కస్టమర్లు అయితే రూ.401 ప్లాన్‌తో రోజుకు 3జీబీ డేటాను పొందొచ్చు. రూ.401 ప్లాన్‌ గడువు ముగిసినప్పటికీ స్ట్రీమింగ్‌ యాప్‌ సేవలను 365 రోజుల పాటు పొందొచ్చు.  

రూ.398 ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌ ఉచితంగా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో టెలికాం ప్రొవైడర్లు వివిధ ఆఫర్లతో, ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios