కరోనా వైరస్ అరికట్టేందుకు యాక్ట్ ఫైబర్‌నెట్ అధ్భుతమైన ఆఫర్...
కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా కొన్ని కంపెనీలు ఇంటి నుండి పని చేయాలని ఆదేశించింది. ఇందుకోసం వారిని ప్రోత్సహించడానికి యాక్ట్ ఫైబర్‌నెట్ హై స్పీడ్ తో పాటు ఎక్కూవ డేటాను అందిస్తుంది.
ఇంటర్నెట్ సర్విస్ ప్రొవైడర్ యాక్ట్ ఫైబర్‌నెట్ ఇప్పుడు ఒక కొత్త ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున పలు టెక్ కంపెనీలు వారి ఉద్యోగులను ఇంటి నుండే పని చేయడానికి ప్రోత్సహిస్తుంది. దీనికి తోడుగా యాక్ట్ ఫైబర్‌నెట్ ఇంటి నుండి పనిచేసే వారికోసం మద్దతుగా మార్చి 31 వరకు వేగవంతమైన హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు, ఎక్కూవ డేటాను అందిస్తోంది.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ ఉద్యోగులు వాటి బారిన పడకుండా అలాగే కరోనా వైరస్ వ్యాధిని వ్యాపించకుండా నివారించేందుకు ఇంటి నుండి పని చేయమని భారతీయ కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి.
also read మీ స్మార్ట్ ఫోన్ తో కరోనా వైరస్ కు చెక్...ఎలా అంటే ?
ఇంటి నుండి పని చేయాలనుకునే చాలా మందికి ఎలాంటి ఆటంకం లేకుండా అలాగే ఎక్కువ డేటా అవసరం ఉంటుంది. ఇందుకోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లేయర్ యాక్ట్ ఫైబర్‌నెట్ మార్చి 31 వరకు వేగవంతమైన హై స్పీడ్ ఇంటర్నెట్, ఆన్ లిమిటెడ్ యుసెజ్ విధానంతో ఆఫర్ చేస్తుంది.
“ఇంటి నుండి పని చేయాలనుకునే వారికోసం ప్రస్తుత ఇంటర్నెట్ స్పీడ్ సామర్థ్యాన్ని పెంచడానికి, మేము దీనిని 300 ఎంబిపిఎస్ కు అప్‌గ్రేడ్ చేస్తున్నాము అలాగే మార్చి 2020లో మీకు దీనికోసం అదనపు ఖర్చు లేకుండా ఆన్ లిమిటెడ్ యుసెజ్ ప్లాన్ అందిస్తున్నాము, ”అని కంపెనీ అధికారిక ట్విట్టర్ అక్కౌంట్ ట్వీట్‌లో పేర్కొంది.
యాక్ట్ ఫైబర్‌నెట్ వినియోగదారులు అధికారిక యాప్ లో లాగిన్ అవ్వడం ద్వారా హై స్పీడ్ డాటా ఆఫర్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ భారతదేశంలోని అన్ని యాక్ట్ ఫైబర్‌నెట్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
also read కలర్ డిస్ ప్లేతో రియల్ మీ కొత్త బ్యాండ్... క్రికెట్ మోడ్ కూడా....
యాక్ట్ ఫైబర్‌నెట్ ప్రస్తుతం 100ఎంబిపిఎస్ వేగాన్ని అందిస్తుంది, కాని ఈ ఆఫర్ కింద ఇప్పుడు 300ఎంబిపిఎస్ అప్‌గ్రేడ్ చేయబడతాయి.
బెంగళూరులోని యాక్ట్ ఫైబర్‌నెట్ సేవలు ప్రస్తుతం దేశంలోని 18 నగరాల్లో అందుబాటులో ఉంది.బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ ఇంకా మరిన్ని నగరాలలో ఉన్నాయి.