చెన్నై: ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది సర్వ సాధారణం. కానీ ప్రస్తుతం ప్రపంచాన్ని వానికిస్తున్న కరోనా వైరస్ స్మార్ట్ ఫోన్ వల్ల కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని ఎవ్వరూ ఊహించలేరు. స్మార్ట్ ఫోన్లు అన్నీ జెర్మ్స్, హాని కలిగించే క్రిములను సులభంగా పట్టేసుకుంటాయి.

కాబట్టి  కరోనావైరస్ (కోవిద్-19) ను దూరంగా ఉంచడానికి  మీరు తరచుగా చేతులు ఫేస్ మస్కూలు ధరించడం ఉపయోగిస్తున్నప్పటికీ మీ స్మార్ట్ ఫోన్ నుండి కూడా సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి.

మీ స్మార్ట్ ఫోన్ చాలా మురికిగా అనిపించకపోయినా, సగటు మొబైల్ ఫోన్‌లో టాయిలెట్ సీటు కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ప్రకారం 30 శాతం వైరస్లు మీ ఫోన్ నుండి మీ చేతులకు తరువాత మీ శరీరంపై నుంచి  మీ కళ్ళు, ముక్కు ద్వారా వ్యాధికారకాలు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి.

also read జియో యూసర్లకు షాక్: డేటా టారిఫ్ ప్లాన్ ఛార్జీలు పెంపు....

కరోనా వైరస్ మెటల్స్, గ్లాస్ లేదా ప్లాస్టిక్ వంటి పరికరాలపై 9 రోజుల వరకు సూక్ష్మ జీవులు, కళ్ళకు కనిపించని వైరస్ జీవించగలవు. వేర్వేరు ఉష్ణోగ్రతలకు మారినపుడు అవి బహిర్గమయి రోగకారక క్రిములు ఎక్కువ కాలం జీవించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని డబల్యూ‌హెచ్‌ఓ తెలిపింది. అయితే ముందు జాగ్రత్త కోసం, మీ ఫోన్‌ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిది.

కాబట్టి, మీ ఫోన్‌ను తరచుగా శుభ్రపరచడం ద్వారా  వైరస్ సంక్రమణ వ్యాప్తిని మీరు ఎలా నిరోధించవచ్చో ఇక్కడ చూడండి.

1.మొదట మీరు మీ స్మార్ట్ ఫోన్ స్విచ్ అఫ్ చేసి, మీ ఫోన్‌ కేసు లేదా బ్యాక్ కవర్ తీయండి.

2. ఫోన్ తీసే ముందు చేతులు కడుక్కొని వాటిని ఆరబెట్టండి లేదా హ్యాండ్ శానిటైజర్‌ను వాడండి.

3. మీ ఫోన్‌ కి స్క్రీన్ గార్డ్ ఉండేలా చూసుకోండి లేదా ఒక వీలైనంత త్వరగా కొత్తది వేయించుకోండి.

4. కొన్ని క్లీనింగ్ ఆల్కహాల్ (ఐసోప్రొపైల్ ఆల్కహాల్) తిసుకొని  మెత్తటి ఫైబర్ బట్టతో (లేదా లెన్స్ క్లీనింగ్ క్లాత్) ను తీసుకొని స్క్రీన్ ప్రొటెక్టర్ పై జాగ్రత్తగా  తుడవండి.

5. ఫోన్ వెనుక భాగంలో కూడా అదే పద్ధతిలో తుడవండి. మీరు ఆన్‌లైన్‌లో లేదా మీ ఆప్టిషియన్ల వద్ద క్లీనింగ్ వైప్స్ కొనుగోలు చేసి కూడా ఉపయోగించవచ్చు.

also read ఫేస్‌బుక్ ఉద్యోగికి కొరోనావైరస్... మరో 39 మందికి వ్యాధి లక్షణాలు....

6.  ఛార్జింగ్ పోర్ట్, ఇయర్ ఫోన్ జాక్ శుభ్రం చేయడానికి క్లీనింగ్ ఆల్కహాల్ తో  కాటన్ బట్టతో శుభ్రపరచండి.

7. ప్లాస్టిక్ లేదా సిలికాన్ బ్యాక్ కవర్లను మీరు వాడుతున్నట్టు అయితే మీరు వాటిని వెచ్చని నీటిలో కొన్ని చుక్కల డిష్ వాష్ లిక్విడ్ కలిపి  వాటిని కడగవచ్చు. వాటిని తిరిగి ఫోన్‌ కి అమర్చడానికి ముందు వాటిని పూర్తిగా ఆరనివ్వండి.

8. లెథర్ లేదా పియు లెథర్  బ్యాక్ కవర్ల వాడుతున్నట్లయితే మీరు క్రిమిసంహారక లిక్విడ్ తో వాటిని తుడవడం మంచిది.

9. వీలైనంత వరకు, కాల్ చేయడానికి ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌లను ఉపయోగించండి. తద్వారా మీరు ఫోన్‌ నుండి మీ ముఖానికి  ఎలాంటి హాని కలిగించే వైరస్ చేరాదు.  

10. ఫోన్ ఇంకా దాని బ్యాక్  కవర్‌ను శుభ్రపరిచిన తర్వాత, వాటిని తిరిగి ఫోన్ కి అమర్చాక  కనీసం 15 నిమిషాలు వేచి చూశాక మీ స్మార్ట్ ఫోన్ స్విచ్ ఆన్ చేయండి.