సీటెల్ లోని ఫేస్‌బుక్  సంస్థ  కార్యాలయంలో పనిచేసే ఫేస్‌బుక్ ఉద్యోగికి కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేవలం బుధవారం  ఒక్క రోజున సీటెల్ నగరంలో మరణించిన వారి సంఖ్య 10కి చేరుకుంది.

ఫేస్‌బుక్ సహ ఇతర టెక్ దిగ్గజాలు తమ కార్యాలయంలో పని చేసే ఉద్యోగుల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకున్నాయి. ఇందుకోసం ఫేస్‌బుక్ కార్యాలయం మార్చి 9 వరకు మూసివేయనున్నట్లు తెలిపింది.

also read ఫ్లిప్‌కార్ట్‌ కో ఫౌండర్‌ సచిన్ బన్సాల్‌పై వరకట్న వేధింపుల కేసు

కరోనా వైరస్ భయాల కారణంగా సోషల్ మీడియా సంస్థ అయిన ఫేస్‌బుక్ ఉద్యోగులను నెల చివరి వరకు ఇంటి నుండి పని చేయమని కోరారు. " ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రజారోగ్య అధికారుల సలహాలను అనుసరిస్తున్నాము" అని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

సీటెల్ ప్రాంతంలోని సుమారు 50 వేల మంది ఉద్యోగులను కరోనా వైరస్ నుండి రక్షించడానికి మైక్రోసాఫ్ట్  చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ఈ ప్రాంతంలో సుమారు 39 మందికి సోకింది స్థానిక అని ఆరోగ్య అధికారులు అన్నారు.


స్థానిక ఆరోగ్య అధికారుల మార్గదర్శకత్వానికి అనుగుణంగా సీటెల్, కాలిఫోర్నియా బే ప్రాంతాల్లోని ఉద్యోగులందరినీ మార్చి 25 వరకు ఇంటి నుంచి  పని చేయాలని టెక్ కంపెనీ సూచించింది.

అలాగే  కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలలో అనవసరమైన వ్యాపార ప్రయాణాలను రద్దు చేయాలని ఉద్యోగులకు సూచించారు. సీటెల్‌లోని కంపెనీ "బ్రెజిల్" కార్యాలయంలో పనిచేసే అమెజాన్ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు మంగళవారం ఒక అంతర్గత ఇమెయిల్ ద్వారా తెలిపింది.

also read ఆన్ లైన్‌ చెల్లింపులలో కొత్త టెక్నాలజి...వేలి ఉంగరంతోనూ పేమెంట్స్....

అనారోగ్యం కారణంగా  ఆ ఉద్యోగి ఫిబ్రవరి 24న ఉద్యోగాన్ని  విడిచిపెట్టాడు. తరువాత  అతనికి కరోనా వైరస్ సోకినట్లు కంపెనీకి అని సమాచారం అందింది."కరోనా వైరస్ సోకిన బాధిత ఉద్యోగికి మేము అండగా ఉంటాము" అని అమెజాన్ ప్రతినిధి  న్యూస్‌  పత్రికతో అన్నారు.
 
 కరోనా వైరస్ వ్యాధిని ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఇంటి వద్దే ఉండాలని వారు కోరారు. ఇటలీలోని ఇద్దరు అమెజాన్ ఉద్యోగులకు ఈ వైరస్ ఉన్నట్లు గతంలో నిర్ధారించారు. వాషింగ్టన్ రాష్ట్రంలో మరణించిన వారిలో ఎక్కువ మంది సీటెల్‌కు శివారు తూర్పున ఉన్న నర్సింగ్ హోమ్ అయిన లైఫ్ కేర్ సెంటర్‌లో నివసించేవారు.