Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడు: ఆధిక్యంలోకి స్టాలిన్ తనయుడు ఉదయ నిధి స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చెపక్  నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉదయ నిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. కాగా కొలత్తూరులో ఎంకే స్టాలిన్ ఆధిక్యంలో ఉన్నారు. 
 

Udhayanidhi stalin backward in tamil nadu election results - bsb
Author
Hyderabad, First Published May 2, 2021, 9:52 AM IST

తమిళనాడులోని చేపాక్ నియోజకవర్గంలో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలోకి వచ్చారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చెపక్  నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉదయ నిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. కాగా కొలత్తూరులో ఎంకే స్టాలిన్ ఆధిక్యంలో ఉన్నారు. 

ఇప్పుడే ప్రకటించిన (రిపబ్లిక్ సి ఓటర్ ) ఎగ్జిట్ పోల్ లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చింది. ప్రస్తుత పళనిస్వామి ప్రభుత్వానికి ఓటమి ఖాయమని బల్ల గుద్ది ప్రకటించింది. ఉన్న మొత్తం సీట్లలో డీఎంకే కూటమి 10-20 సీట్లను సాధించి అధికారం హస్తగతం చేసుకుంటుందని సర్వే పేర్కొంది. 

మరో మూడు రాష్ట్రాలు, మరొక కేంద్రపాలీత ప్రాంతాలతో కలిపి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే దఫాలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అనేక పార్టీలు బరిలో ఉన్నప్పటికీ... ప్రధానంగా పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే సాగింది.  

డీఎంకే, కాంగ్రెస్ తో జతకట్టి బరిలో దిగగా, అన్నా డీఎంకే బీజేపీతో జతకట్టి బరిలోకి దిగింది. డీఎంకే, అన్నాడీఎంకేల అధినేతలు కరుణానిధి, జయలలితలు లేకుండా ఆ పార్టీలు ఎదుర్కుంటున్న తొలి ఎన్నికలు ఇవే..!కమలహాసన్, టీటీవి దినకరన్ కి చెందిన పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ... వారి ప్రభావం నామమాత్రంగానే ఉంది. 

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమిళనాడు అంతటా గెలుపుబావుటా ఎగురవేసింది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్ లో కూడా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 155 నుండి 177 సీట్ల వరకు సాధించి దక్కించుకుంటుందని పేర్కొనగా, అధికార అన్నాడీఎంకే మాత్రం 22 నుండి 83 సీట్ల వరకు సాధిస్తుందని పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios