తమిళనాడు రాజకీయాల్లో జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె రాజకీయప్రస్థానం, ప్రత్యర్థుల్ని ఓడించే తీరు అంతా అద్భుతంగా ఉంటుంది. అలాగే 
తమిళనాడులోని డాక్టర్ రాధాకృష్ణ నగర్ కు చాలా ప్రాధాన్యం ఉంది. మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఇక్కడి నుంచి రెండు సార్లు గెలిచారు. ఆమె మరణానంతరం ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ నేత  టీటీవీ దినకరన్ విజయం సాధించారు.

అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్ రాజేశ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా జేజే ఎబెనేజర్ (డీఎంకే), డాక్టర్ పీ కాళిదాస్ (ఏఎంఎంకే), ఫాజిల్ (ఎంఎన్ఎం), కే గౌరీశంకర్ (ఎన్‌టీకే) పోటీలో ఉన్నారు. 

డాక్టర్ ఆర్.కె.నగర్ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 2,62,738 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు లక్షా 26వేల 744 మంది కాగా, మహిళలు లక్షా 35 వేల 889 మంది. ట్రాన్స్ జెండర్లు 105 మంది ఉన్నారు.

2011 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి జే జయ లలిత ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. ఆమె ప్రత్యర్థి సీపీఐ నేత సీ మహేంద్రన్‌కు కేవలం 9,710 ఓట్లు మాత్రమే వచ్చాయి.  ఆమెకు 1,60,432 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో జయలలిత ఒక లక్షా 50 వేల 722 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.

తమిళనాడు: పదేళ్ల తర్వాత అధికారంలోకి డిఎంకె ...

అలాగే 2016 లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి జయ లలిత తన సమీప ప్రత్యర్థి వాసంతి దేవిపై దాదాపు 40 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే 
జయలలిత మరణానంతరం డాక్టర్ రాధాకృష్ణ నగర్ నియోజకవర్గానికి 2017 లో జరిగిన ఉప ఎన్నికల్లో జయలలిత స్నేహితురాలు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ఏఐఏడీఎంకే అభ్యర్థి మధుసూదన్ ను ఓడించారు. 

తాజాగా ఈ నియోజకవర్గానికి 2021 ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఏఐఏడీఎంకే  చెందిన ఆర్ఎస్ రాజేష్, ప్రతిపక్ష డీఎంకేకు చెందిన jజేజే ఎబెనేజర్, ఎంఎన్ఎం అభ్యర్థి ఫాజిల్, ఎన్‌టీకే తరపున గౌరీశంకర్, ఏఎంఎంకే తరపున డాక్టర్ పీ కాళిదాస్ పోటీ చేస్తున్నారు. కొందరు స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు.

ఆదివారం ఉదయం 11. 45 నిమిషాల వరకు అందిన సమాచారం ప్రకారం ఈ నియోజకవర్గంలో డీఎంకే ముందంజలో కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి ఎబినేజర్ కు 3,527 ఓట్లు లభించగా,  ఆర్ఎస్ రాజేశ్ (ఏఏఐడీఎంకే)కు 2,133 ఓట్లు లభించాయి.