చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సినీ తార వద్ద కిలోల కొద్దీ బంగారం ఉంది. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా ఆమె థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె దాఖలు చేసిన నామినేషన్ కు అఫిడవిట్ దాఖలు చేశారు. 

అఫిడవిట్ లో ఖుష్బూ ఆస్తులు వెల్లడయ్యాయి. తన వద్ద 8.5 కిలోల బంగారం ఉన్నట్లు ఆమె తెలిపారు రూ. 6.39 కోట్ల విలువ చేసే చరాస్తులు, రూ. 34.56 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు ఖుష్బూ తెలిపారు. మొత్తం ఖుష్బూ ఆస్తుల విలువ రూ.40.96 కోట్లు. 

తన భర్త సుదర్ సి వద్ద 495 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి ఉన్నట్లు ఖుష్బూ వెల్లడించారు. తాను ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నట్లు ఆమె తెలిపారు తన వార్షికాదాయం రూ.1.50 కోట్లుగా తెలిపారు.

కాంగ్రెసుకు రాజీనామా చేసి ఖుష్బూ బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. అన్నాడియంకెతో పొత్తు పెట్టుకుని బిజెపి తమిళనాడులో పోటీ చేస్తోంది. ఇందులో భాగంగా ఖుష్బూ థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు.