సొంత రాష్ట్రం తమిళనాడు ఎన్నికల్లో తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  చెన్నైలోని  విరుంబాగం పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

ఆమెతోపాటు భర్త డాక్టర్ సౌందరరాజన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించాలని కోరారు. 

తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి అని అన్నారు. అనంతరం అక్కడి నుంచి  పుదుచ్చేరి చేరుకుని... అక్కడి పోలింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.