Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడు: కోయంబత్తూరులో కమల్‌హాసన్ లీడ్

సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కోయంబత్తూరు దక్షిణ అసెంబ్లీ స్థానం నుండి  ఆయన తొలిసారి బరిలోకి దిగారు. ఈ స్థానం నుండి ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

Kamal Haasan Leads in Coimbatore South lns
Author
Chennai, First Published May 2, 2021, 10:01 AM IST

చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కోయంబత్తూరు దక్షిణ అసెంబ్లీ స్థానం నుండి  ఆయన తొలిసారి బరిలోకి దిగారు. ఈ స్థానం నుండి ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.తమిళనాడు రాష్ట్రంలోని థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  బీజేపీ అభ్యర్ధిగా  పోటీ చేసిన సినీ నటి కుష్బూ సుందర్ వెనుకంజలో ఉన్నారు. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు  కుష్పూ సుందర్ కాంగ్రెస్ పార్టీని  నుండి  బీజేపీలో చేరారు. థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆమె  బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో  తన సమీప ప్రత్యర్ధి కంటే ఆమె వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుండి  పోటీలో ఉన్న డిఎంకె అభ్యర్ధి ఎజాలిన్  కుష్బూపై లీడ్ లో ఉన్నారు.

ప్రస్తుత పళనిస్వామి ప్రభుత్వానికి ఓటమి ఖాయమని బల్ల గుద్ది ప్రకటించింది. ఉన్న మొత్తం సీట్లలో డీఎంకే కూటమి 10-20 సీట్లను సాధించి అధికారం హస్తగతం చేసుకుంటుందని సర్వే పేర్కొంది. మరో మూడు రాష్ట్రాలు, మరొక కేంద్రపాలీత ప్రాంతాలతో కలిపి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే దఫాలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరిగాయి.

 ఈ ఎన్నికల్లో అనేక పార్టీలు బరిలో ఉన్నప్పటికీ... ప్రధానంగా పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే సాగింది.  డీఎంకే, కాంగ్రెస్ తో జతకట్టి బరిలో దిగగా, అన్నా డీఎంకే బీజేపీతో జతకట్టి బరిలోకి దిగింది. డీఎంకే, అన్నాడీఎంకేల అధినేతలు కరుణానిధి, జయలలితలు లేకుండా ఆ పార్టీలు ఎదుర్కుంటున్న తొలి ఎన్నికలు ఇవే..!కమలహాసన్, టీటీవి దినకరన్ కి చెందిన పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ... వారి ప్రభావం నామమాత్రంగానే ఉంది. 

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమిళనాడు అంతటా గెలుపుబావుటా ఎగురవేసింది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్ లో కూడా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 155 నుండి 177 సీట్ల వరకు సాధించి దక్కించుకుంటుందని పేర్కొనగా, అధికార అన్నాడీఎంకే మాత్రం 22 నుండి 83 సీట్ల వరకు సాధిస్తుందని పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios