తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాల సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా  ప్రధాని నరేంద్రమోడీపై డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా బీజేపీ ఎన్నికల్లో గెలవడం లేదని ఆయన ఆరోపించారు. 

చాలా చోట్ల వున్న ప్రభుత్వాలను కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. సీబీఐ, ఎన్నికల సంఘం, ఐటీ శాఖ, సుప్రీంకోర్టులను చేతుల్లో పెట్టుకుని అందరినీ బెదిరిస్తూ ప్రభుత్వాలను నడుపుతున్నారని స్టాలిన్ ఆరోపించారు. మోడీ క్రేజ్ రాను రాను తగ్గిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 

రాజకీయ ఉద్దండులు జయలలిత, కరుణానిధి మరణించిన తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో కొత్త నాయకత్వాలు రణరంగంలో ఎలా నిలబడతాయోనని ఉత్కంఠ నెలకొంది.

Also Read:తమిళనాడు ఎన్నికలు: పారుతున్న పీకే వ్యూహాలు, డీఎంకేదే విజయమన్న సర్వేలు

పదేళ్ల పాటు అధికారానికి దూరమైన డీఎంకే ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తుండగా, హ్యాట్రిక్ కొట్టాలని అధికార అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. 

అయితే తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంటుందని దాదాపుగా అన్ని సర్వేలు చెబుతున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని యూపీఏ కూటమికి 170 స్థానాలు వస్తాయని సర్వేలు నిగ్గుతేల్చాయి.