తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈరోజు కూడా పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓటు వేయడానికి వచ్చిన డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్.. తన చొక్కాపై డీఎంకే పార్టీ చిహ్నం ఉండడం వివాదాస్పదమైంది

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈరోజు కూడా పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓటు వేయడానికి వచ్చిన డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్.. తన చొక్కాపై డీఎంకే పార్టీ చిహ్నం ఉండడం వివాదాస్పదమైంది.

ఓటర్లను ప్రభావితం చేసేందుకే ఉదయనిధి స్టాలిన్, తమ పార్టీ చిహ్నం ఉన్న చొక్కా వేసుకుని వచ్చారని అన్నాడీఎంకే ఆరోపించింది. అక్కడితో ఆగకుండా ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

కాగా, ఉదయనిధి స్టాలిన్ మొదటి సారిగా ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ సందర్భంగా మంగళవారం ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి తేనంపేట పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పరీక్ష ఇప్పుడే పూర్తైందని, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. అయితే మంత్రి పదవి గురించి అడిగిన ప్రశ్నలకు అది తమ పార్టీ అధినేత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలివిగా సమాధానం చెప్పారు.

ఇక కరుణానిధి కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా పోటీ చేస్తున్న ఉదయనిధి.. చెపాక్‌ స్థానం నుంచి బరిలో నిలిచారు.