టీం ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్... ఇంటర్నేషనల్ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా...తన క్రికెట్ కెరీర్ లో తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన ఇద్దరు వ్యక్తుల పేర్లను యువరాజ్ తాజాగా ప్రకటించారు.  అందులో ఒకరు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య  మురళీధరన్, మరొకరు ఆసిస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్ గ్రాత్ అని చెప్పారు. వీరిద్దరి బౌలింగ్ తనను  చాలా ఇబ్బంది పెట్టిందని అన్నారు.

ఇక విదేశీ ఆటగాళ్లలో ఇష్టమైన క్రికెటర్ ఎవరూ అంటే... నిమిషం ఆలోచించకుండా రికీ పాంటింగ్ పేరు చెప్పారు. పాంటింగ్‌ బ్యాటింగ్‌తో పాటు వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌లతో ఆడటాన్ని ఎంతో ఆస్వాదించానని యువీ పేర్కొన్నాడు. 

మరోవైపు గతేడాదే ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాలనుకున్నానని చెప్పాడు. అది కుదరకపోగా ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో తనకు మరిన్ని అవకాశాలు రాలేదని వాపోయాడు. జీవితంలో అనుకున్నవన్నీ జరగవని, ఈ ఐపీఎల్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఆడింటే ఇంకా సంతోషంగా రిటైరయ్యేవాడినని తెలిపాడు.