Yuvraj Singh: యువరాజ్ సింగ్ రెండోసారి తండ్రి అయ్యాడు. దీంతో భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇల్లు సందడిగా మారింది. సిక్సర్ కింగ్ గా గుర్తింపు పొందిన ఈ క్రికెటర్ ఇంట్లో కుమార్తె జన్మించింది. టీం ఇండియా లెజెండ్ రెండోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో సంబంధిత ఫొటోల‌ను పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఇవి వైర‌ల్ గా మారాయి.  

Yuvraj Singh, Hazel Keech welcome baby girl: యువరాజ్ సింగ్ రెండోసారి తండ్రి అయ్యాడు. దీంతో భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇల్లు సందడిగా మారింది. సిక్సర్ కింగ్ గా గుర్తింపు పొందిన ఈ క్రికెటర్ ఇంట్లో కుమార్తె జన్మించింది. టీం ఇండియా లెజెండ్ రెండోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో సంబంధిత ఫొటోల‌ను పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఇవి వైర‌ల్ గా మారాయి.

వివ‌రాల్లోకెళ్తే.. 2011లో భారత జట్టు ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ రెండోసారి తండ్రి అయ్యాడు. సిక్సర్ కింగ్ ఇంట్లో ఒక చిన్నారి ఆడ‌బిడ్డ జన్మించింది. భార్య హాజెల్ కీచ్, కుమారుడితో కలిసి కూతురిని ఒడిలో పెట్టుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో యువ‌రాజ్ సింగ్ షేర్ చేశాడు. తన ఇంటికి యువరాణి రాకతో కుటుంబం ఎంత ఆనందంగా ఉంద‌ని చెప్పాడు. యువరాజ్ సింగ్ తన భార్య హాజెల్ కీచ్ తో కలిసి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆసక్తికర విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వార్త షేర్ అయినప్పటి నుంచి పలువురు ఈ జంటను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

View post on Instagram

"మా చిన్న యువరాణి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి రాత్రిపూట నిద్రలేవడం మరింత సరదాగా మారింది. ఈ అనుభవం భిన్నంగా ఉంది. ఇప్పుడు కుటుంబం సంపూర్ణంగా అనిపిస్తుంది.. చాలా సంతోషంగా ఉందంటూ" యువ‌రాజ్ సింగ్ పేర్కొన్నారు. హాజెల్ కీచ్ తమ కుమారుడు ఒరియన్ కీచ్ సింగ్ ను ఎత్తుకుని ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్ గా మారింది. పోస్ట్ చేసినప్పటి నుంచి లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఈ షేర్ కు పలు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 

అకస్మాత్తుగా సూప‌ర్ గుడ్ న్యూస్ చెప్ప‌డంతో యువరాజ్ సింగ్ అభిమానులు సంతోషం వ్య‌క్తంచేస్తూ శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఇది చాలా పెద్ద వార్త.. ఎందుకంటే ఈ విష‌యం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కుటుంబ సభ్యులు, మాజీ క్రికెటర్ సన్నిహితులు మినహా ఆయన తండ్రి కాబోతున్నారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ ఫోటోను షేర్ చేసినప్పటి నుంచి యువరాజ్ సింగ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.