టీంఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఓ టీవి సీరియల్ లో డిటెక్టివ్ క్యారెక్టర్ ''కరంచంద్'' తో పోలుస్తూ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టింఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటోకు హర్భన్ చేసిన కామెంట్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 

టీంఇండియా ఆటగాడు శిఖర్ ధావన్ జట్టు సభ్యులతోనే కాదు విదేశీ ఆటగాళ్లతో, అభిమానులతోనూ సరదాగా వుంటాడన్న విషయం అందరికి తెలిసిందే. వారిని ఆటపట్టిస్తూ, సరదాగా వారిపై సెటైర్లు వేస్తూ తన చుట్టూ ఎప్పుడూ నవ్వులు విరుస్తుండేలా చూసుకుంటాడు. 

అయితే టెస్ట్ సీరిస్ విజయం తర్వాత భారత జట్టు రెట్టించిన విశ్వాసంతో వన్డే సీరిస్ ను ప్రారంభించింది. అయితే సీరిస్ ఆరంభంలోనే సిడ్నీ వన్డేలో చతికిలపడటంతో జట్టులో కాస్త నిరాశ ఆవరించింది. 

దీంతో జట్టు సభ్యులనే కాదు అభిమానులను ఈ నైరాశ్యం నుండి బయటకు తీసుకురావాలని  అనుకున్నాడో ఏమోగాని...మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ ఓ సరదా ఫోటోను తన ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తోటి ఆటగాడు రవీంద్ర జడేజాతో కూడిన ఫోటోను పోస్ట్ చేసి ''డిటెక్టివ్ జడ్డూ''అంటూ కామెంట్ ను జత చేశాడు. 

ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌పై హర్భజ్ సింగ్ స్పందిస్తూ జడేజాను కరంచంద్‌తో పోల్చాడు. ఇతడితో పాటు యువరాజ్ సింగ్, వృద్దిమాన్ సాహా కూడా ఈ ఫొటోపై కామెంట్ చేశారు. నవ్వు ఆపలేకపోతున్నట్లుగా స్మైలీ సింబల్ తో కామెంట్  చేశారు. ఒత్తిడి సమయంలో కూడా శికర్ ఇలా సరదా పోస్ట్ చేయడంపై నెటిజన్లలో మిశ్రమ స్పందన వెలువడుతోంది.   
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Detective Jaddu🔍

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on Jan 12, 2019 at 10:26pm PST