Sakshi Malik: 'నేను ఇకపై రెజ్లింగ్ ఆడను'... సాక్షి మాలిక్ ఎమోషనల్

wrestler Sakshi Malik: రెజ్లింగ్ స‌మాఖ్య ఎన్నిక‌ల్లో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న‌ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ స‌న్నిహితుడు విజ‌యం సాధించ‌డంపై తీవ్ర ఆవేద‌న‌కు గురైన రెజ్ల‌ర్ సాక్షి మాలిక్.. తాను ఇక‌పై రెజ్లింగ్ ఆడ‌న‌ని ఏడ్చేశాడు. 
 

wrestler Sakshi Malik says 'I quit wrestling' as Brij Bhushan aide Sanjay Singh elected WFI president RMA

Sakshi Malik: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎంపిక నేపథ్యంలో సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు స్వస్తి ప‌లుకుతున్న‌ట్టు పేర్కొంటూ తీవ్ర ఆవేదిన‌కు గుర‌య్యారు. భారత టాప్ మహిళా రెజ్లర్ న్యూఢిల్లీలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఎమోష‌న‌ల్ గురై ఏడ్చేశారు. సమ్మర్ ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్ గా 31 ఏళ్ల ఈ స్టార్ రికార్డు సృష్టించింది. 2016 రియో డి జనీరో ఒలింపిక్స్ లో చారిత్రాత్మక కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్.. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కూడా పతకాలు సాధించింది.

ఈ రోజు ఏం జరిగిందో అందరం చూశామని సాక్షి విలేకరులతో అన్నారు. "బ్రిజ్ భూషణ్ కుడిభుజం అధ్య‌క్షుడ‌య్యాడు. మహిళా అధ్యక్షురాలి కోసం మా డిమాండ్ ఉంది. ఏ మహిళ కూడా ఎన్నుకోబడకపోవడం నిరాశపరిచింది. మా పోరాటం కొన‌సాగుతుంది. తర్వాతి తరం రెజ్లర్లు కూడా పోరాడవలసి ఉంటుందని" అన్నారు. అలాగే, మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై వేధింపుల‌కు నిర‌స‌న‌గా తాము 40 రోజుల పాటు రోడ్లపై పడుకున్నామనీ, దేశంలోని పలు ప్రాంతాల నుంచి చాలా మంది తమకు మద్దతుగా వచ్చారని చెప్పారు. "బ్రిజ్ భూషణ్ సింగ్ వ్యాపార భాగస్వామి, సన్నిహితుడు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికైతే నేను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటాను. దేశం కోసం నేను ఏ అవార్డులు గెలుచుకున్నా, మీ ఆశీస్సులతోనే గెలిచాను, దేశ ప్రజలందరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని" పేర్కొంటూ  సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పారు.

డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తోటి రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ తో కలిసి సాక్షి విలేకరుల సమావేశం నిర్వహించింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ కు అత్యంత సన్నిహితుడైన సంజయ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అనితా షియోరన్ ను 40:7 తేడాతో ఓడించాడు. బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ కూడా మాట్లాడుతూ ఈ ఎన్నిక‌పై స్పందించారు. తాము ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదని, ప్రతిరోజూ సోదరీమణులను వేధిస్తున్న వ్యక్తితోనే తమ పోరాటం జరిగిందన్నారు. తనకు అధికారం ఉంది కాబట్టే కేసుకు భిన్నమైన వాదనలు వినిపించేందుకు ఆయన అన్నింటిని ఉపయోగించారనీ, ఇది ఎవరి భవిష్యత్తు సురక్షితం కాదని తెలియజేస్తోందని భజరంగ్ పూనియా అన్నారు. "తక్కువ అంచనాలు ఉన్నాయి, కానీ మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. రెజ్లింగ్ భవిష్యత్తు అంధకారంలో ఉండటం బాధాకరం. మా బాధను ఎవరికి చెప్పుకోవాలి?... మేం ఇంకా పోరాడుతున్నాం' అని వినేశ్ ఫొగాట్ అన్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios